సమంత పాత్రలో మేఘా ఆకాశ్..?

Updated By ManamTue, 09/04/2018 - 14:43
Megha Akash

Megha Akash‘లై’, ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రాలతో తెలుగు వారికి దగ్గరైన మేఘా ఆకాశ్ కోలీవుడ్‌లో బంపర్ ఆఫర్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో ఘన విజయం సాధించిన ‘అత్తారింటికి దారేది’ తమిళ రీమేక్‌లో మేఘా ఆకాశ్ నటించనున్నట్లు తెలుస్తోంది. శింబు ఇందులో హీరోగా నటిస్తుండగా.. ఈ నెల చివరి వారంలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. మొదటి షెడ్యూల్‌లోనే మేఘా జాయిన్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో సమంత పాత్రలో ఆమె నటిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. కాగా ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. సుందర్.సి దర్శకత్వం వహించనున్నాడు.

English Title
Megha Akash in Attarintiki Daredi remake..?
Related News