'మెహ‌బూబా'.. ఫ‌స్ట్ సింగిల్ వ‌చ్చేసింది

Updated By ManamMon, 04/16/2018 - 17:09
mehabooba

mehaboobaపూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'మెహ‌బూబా'. పూరీ ఆకాశ్‌, నేహా శెట్టి జంట‌గా న‌టిస్తున్న ఈ సినిమా 1971 ఇండో పాక్ వార్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది. వేస‌వి సంద‌ర్భంగా మే 11న ఈ మూవీ తెర‌పైకి రానుంది. ఇదిలా ఉంటే.. సందీప్ చౌతా సంగీత సార‌థ్యంలో రూపొందిన 'ఓ ప్రియా నా ప్రియా' అంటూ సాగే పాట‌ను.. ఈ సినిమా ఫ‌స్ట్ సింగిల్‌గా ఈ రోజు (సోమ‌వారం) చిత్ర బృందం విడుద‌ల చేసింది. భాస్క‌ర‌భ‌ట్ల‌ ర‌చించిన ఈ పాట‌ను ప్ర‌గ్యా దాస్ గుప్తా, సందీప్ బాట్రా గానం చేశారు. మెలోడీయ‌స్‌గా సాగే ఈ పాట విన‌గానే ఆక‌ట్టుకునేలా ఉంది.

English Title
'mehabooba' first single is here
Related News