మిలియ‌న్ డాల‌ర్ క్వీన్.. స‌మంత‌ (స్పెష‌ల్ స్టోరీ)

Updated By ManamTue, 04/03/2018 - 20:11
sam

samanthaగౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏ మాయ చేసావే’ (2010) చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు సమంత. ఆ సినిమాలో జెస్సీగా త‌న‌ నటనతో నిజంగానే మాయ చేసారు. అంతేగాకుండా.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకున్నారు సామ్. అదే సంవత్సరంలో విడుదలైన ‘బృందావనం’ కూడా ఘన విజయం సాధించింది. హ్యాట్రిక్ హిట్ కోసం మహేష్ సరసన నటించిన ‘దూకుడు’ సినిమాతో.. ఆ ముచ్చట కూడా తీరిపోయింది. 'దూకుడు' ఘ‌న‌విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా.. తొలి మిలియ‌న్ డాల‌ర్ మూవీగా యూఎస్‌లో ప్ర‌త్యేక స్థానం ద‌క్కించుకుంది. అంటే.. తొలి మిలియ‌న్ డాల‌ర్ మూవీ హీరోయిన్‌గా స‌మంత‌కి ప్ర‌త్యేక స్థానం ద‌క్కింద‌న్న‌మాట‌.  

samanthaఆ తర్వాత ప్రతీ ఏడాది ఒక సినిమాతో ఈ క్లబ్‌లో చోటును పదిలం చేసుకుంటూ వచ్చారు. ‘దూకుడు’ (2011) తర్వాత..  2012లో ‘ఈగ’, 2013లో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘అత్తారింటికి దారేది’, 2014లో ‘మనం’, 2015లో ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, 2016లో ‘బ్రహ్మోత్సవం’, ‘అఆ’, ‘జనతా గ్యారేజ్’, 2018లో ‘రంగస్థలం’.. ఇలా స‌మంత‌ నటించిన పది తెలుగు సినిమాలు మిలియన్ డాలర్ క్లబ్‌లో స్థానాన్ని సంపాదించుకున్నాయి. వీటితో పాటు తమిళంలో (2016లో ‘24’, ‘తెరి’, 2017లో ‘మెర్సల్’) నటించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇందులో ‘అఆ’, ‘రంగస్థలం’ సినిమాలు.. 2 మిలియన్ డాలర్ మార్కుని అందుకోవడం విశేషం.

ఇలా మొత్తం 13 సినిమాలతో “మిలియన్ డాలర్ క్వీన్” గా  స‌మంత‌.. ఈ క్లబ్‌లో తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈమె తర్వాత ఆరు చిత్రాలతో కాజల్ అగర్వాల్ రెండో స్థానంలో ఉండగా.. ఐదు సినిమాలతో శ్రుతి హాస‌న్‌.. నాలుగు సినిమాల‌తో అనుష్క మూడో స్థానంలో ఉండడం విశేషం.

English Title
'million dollar queen' samantha (special story)
Related News