కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై అసదుద్దీన్ ఫైర్..

Updated By ManamSat, 09/08/2018 - 20:01
MIM President Asasduddin Owasi, Congress, TDP alliance, KCR, 

MIM President Asasduddin Owasi, Congress, TDP alliance, KCR, హైదరాబాద్: కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ ఆ పార్టీతో ఎలా పొత్తు పెట్టుకుంటుందో చెప్పాలని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం ఎక్కడ పోయిందని ఆయన ప్రశ్నించారు. శనివారం అసదుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీడీపీ పొత్తును రాష్ట్ర ప్రజలు తిప్పికొడతారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. మరోసారి కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపారు. తమకు పదవులపై ఎప్పుడూ ఆశ లేదని ఓవైసీ స్పష్టం చేశారు. మైనార్టీలు, బలహీనవర్గాల కోసం తమ పార్టీ ఎల్లప్పుడూ పాటుపడుతుందనే ఉంటుందని చెప్పారు.

ఎంతో విశ్వాసం ఉండడం వల్లే టీఆర్‌ఎస్ పదవీకాలం ఉన్నా ఎన్నికలకు సిద్ధమైందని కొనియాడారు. ఈ విషయంలో ఇతర రాజకీయ పార్టీలయితే ఒక్క రోజు కూడా తమ పదవిని వదులుకునేందుకు ఇష్టపడరని అన్నారు. కేసీఆర్‌కు రాష్ట్రంలో పాపులారిటీ చాలా ఎక్కువగా ఉందని ప్రశంసించారు. టీఆర్‌ఎస్, ఎంఐఎంను ఒంటరిగా ఢీకొనే దమ్ములేక పొత్తుల కోసం టీడీపీ, కాంగ్రెస్ పాకులాడుతున్నాయని అసదుద్దీన్ విమర్శించారు. 

English Title
MIM President Asaduddin Owasi slams Congress, TDP alliance  
Related News