ఎంఐఎం గూండాయిజం..

Updated By ManamFri, 11/09/2018 - 14:09
MIM workers attack woman Congress leader Ayesha Farheen
  • కాంగ్రెస్ మహిళా నేతపై  దాడి

  • పేట్రేగిన ఎంఐఎం కార్యకర్తలు

  • ప్రచారానికి రావద్దంటూ  వార్నింగ్

  • బజార్‌ఘాట్‌లో ఘటన.. పోలీసుల విచారణ

AIMIM workers booked for beating woman

సమస్యాత్మక ప్రాంతాల్లో కండబలం ఉన్న వారి ఆదిపత్యం కొనసాగుతున్నది. తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని పేట్రేగుతున్నారు. ఈ క్రమంలోనే ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు ఓ మహిళా కాంగ్రెస్ నాయకురాలిపై దాడికి పాల్పడ్డారు. ఎన్నికల ప్రచారం నిర్వహించరాదని బూతులు తిడుతూ చేయిచేసుకోవడం బజార్‌ఘాట్‌లో కలకలం రేపింది. 

అక్కడక్కడా ఎంఐఎం అవలంభిస్తున్న తీరుతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆ పార్టీకి చెందిన నాయకులు,కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఎన్నికల సమయం వచ్చిందంటే భయబ్రాంతులకు గురిచేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే బజార్‌ఘాట్ ప్రాంతంలో ఏ పార్టీ నాయకులు కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించరాదంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మహిళా నాయకురాలిపై ఎంఐఎం కార్యకర్తలు దాడికి పాల్పడడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది.

ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే ఎంఐఎం కార్యకర్తలు రెచ్చిపోయి కనీసం తమ సామాజిక వర్గానికి చెందిన మహిళా అని కూడా చూడకుండా యథేచ్ఛగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. నాంపల్లి బజార్‌ఘాట్‌లో చోటుచేసుకున్న ఘటనలతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నారు. 

ఓ వైపు ఎన్నికల సంఘం ఎన్నికలను ప్రశాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంటే గ్రేటర్‌లో కీలకమైన ప్రాంతాల్లో మాత్రం ఎంఐఎం మినహా ఇతర పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించాలంటే జంకుతున్నారు. ప్రచారం గురించి ఆలోచించుకునే విధంగా ఎంఐఎం కార్యకర్తలు వ్యహరిస్తుండటం ఇప్పుడు గ్రేటర్‌లో చర్చనీయాంశంగా మారింది.

నాంపల్లి బజార్‌ఘాట్‌లో ముందస్తు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళా నేత కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నది. విషయం తెలసుకున్న ఎంఐఎం పార్టీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని కనీసం తమ సామాజిక వర్గానికి చెందిన మహిళ అని చూడకుండా ఆమెను దూషిస్తూ దాడికి దిగడం జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లగా.. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. ఈ విషయంపై సదరు మహిళా కాంగ్రెస్ నేత మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్‌లో ఎంఐఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు రౌడీ ల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల వేళ ఏ పార్టీకైనా పోటీ చేసే అవకాశం ఉండటంతో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే హక్కు ఉందన్నారు. కానీ ఎంఐఎం కార్యకర్తలు, నాయకులు మాత్రం ఇతర పార్టీల తరపున ప్రచారానికి వెళితే దాడులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యింది. 

English Title
MIM workers attack woman Congress leader Ayesha Farheen at Nampally
Related News