పవన్‌పై గుర్రుమన్న మంత్రి దేవినేని!

Updated By ManamTue, 06/19/2018 - 19:15
minister devineni uma fire on janasena chief pawan

minister devineni uma fire on janasena chief pawan

ఏలూరు: ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని జానంపేట వద్ద పోలవరం కుడికాల్వకు మంత్రి జలహారతి ఇచ్చిన అనంతరం కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.." ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఇవ్వనందుకు కేంద్రంలోని టీడీపీ మంత్రులు రాజీనామా చేస్తే పవన్ కల్యాణ్ కోపమొచ్చింది. దీంతో ఆయన ఓ వైపు రోడ్డెక్కారు. వైసీపీ అధినేత జగన్.. కేసుల నుంచి బయటపడేందుకు బీజేపీతో కుమ్మక్కై చంద్రబాబును తిడుతున్నారు. వీళ్లంతా 68 ఏళ్ల వయస్సులో రోజుకు 18 గంటలు కష్టపడి సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్తుంటే ఓర్వలేకపోతున్నారు" అని చెప్పుకొచ్చారాయన. 

పక్కనే ఉన్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను చూపుతూ.. రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేసి ఈయన్ను.. మన ముఖ్యమంత్రిని తిడుతున్నారన్నారు. ఈ మాట అనగానే పక్కనున్న చింతమనేని నవ్వారు.! ఇలా కలెక్టర్లు మొదలుకుని ఎమ్మెల్యేల వరకూ అందరూ సక్రమంగా పనిచేస్తుంటే వాళ్లపై రాళ్లేసే ప్రయత్నం చేయడం కంటే నీచం మరోటి ఉందా..? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇదిలా ఉంటే.. జలహారతికి ముందు సీఎం చంద్రబాబు నాయుడు విగ్రహానికి చింతమనేని పాలాభిషేకం చేశారు.

English Title
minister devineni uma fire on janasena chief pawan
Related News