ఎన్టీఆర్, ప్రభాస్‌లకు మంత్రి సవాల్

Updated By ManamFri, 08/10/2018 - 11:25
talasani srinivasa yadav

talasani srinivasa yadavటాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, ప్రభాస్‌లకు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సవాల్ విసిరారు. హరిత హారంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విసిరిన సవాల్‌ను స్వీకరించిన తలసాని, శుక్రవారం తన ఇంటి ఆవరణలో మూడు మొక్కలు నాటారు.

అనంతరం తన చాలెంజ్ స్వీకరించవలసిందిగా.. సినీ ప్రముఖులు ఎన్టీఆర్, ప్రభాస్, దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్, తితిదే చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌ల పేర్లను వెల్లడించారు. మనవాళి మనుగడక కోసం ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని, భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ ఉండాలంటే అందరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని కోరారు.

English Title
Minister Talasani challenge to NTR, Prabhas 
Related News