బీజేపీ చీఫ్‌గా అమిత్ షా కొనసాగింపు..

Updated By ManamSat, 09/08/2018 - 16:10
2019 Loksabha elections, BJP, Amit Shah's tenure, party chief
  • పదవీకాలాన్ని పొడిగిస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయం

  • షా సారథ్యంలో 2019 ఎన్నికల బరిలో బీజేపీ.. 

2019 Loksabha elections, BJP, Amit Shah's tenure, party chiefన్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా బీజేపీ.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పదవీకాలాన్ని పొడిగించింది. ఈ మేరకు శనివారం ఢిల్లీలో ప్రారంభమైన రెండు రోజుల జాతీయ కార్యనిర్వాహక సమావేశంలో పార్టీ అదిష్ఠానం నిర్ణయం తీసుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్టీ చీఫ్ అమిత్ షా సారథ్యంలో బరిలో దిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ చీఫ్ పదవి భర్తీ ప్రక్రియను వాయిదా వేసినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 2014లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన షా.. పదవీకాలం వచ్చే ఏడాది జనవరితో ముగియనుంది. జాతీయ కార్యనిర్వాహక సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చేలా శాయశక్తిలా కృషి చేస్తానని షా ప్రతిజ్ఞ పునారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో విజయానికి కంటే 2019లో ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

‘‘ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ రాజకీయ నేత ప్రధాని నరేంద్ర మోదీ’’ అని షా కొనియాడారు. దాదాపు ఏడాది తరువాత బీజేపీ జాతీయ కార్యనిర్వాహక సమావేశాన్ని నిర్వహిస్తోంది. రెండు రోజుల జాతీయ కార్యనిర్వహణ సమావేశంలో భాగంగా తొలిరోజు ‘అజేయ బీజేపీ’ అనే నినాదంతో సమావేశాన్ని ప్రారంభించింది. ఈ సమావేశానికి రాష్ట్ర పార్టీలకు చెందిన కీలక నేతలు, అధ్యక్షులు, పార్టీ అధికారులు హాజరయ్యారు. మరోవైపు 2019 లోక్‌సభ ఎన్నికల సమరంలో ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్‌నే లక్ష్యంగా  విపక్షాలు పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, పెద్దనోట్ల రద్దు, రాఫెల్ ఒప్పందం వంటి పలు సమస్యలపై లేవనెత్తే అవకాశాలు ఉన్నాయి. 

English Title
For mission 2019, BJP decides to extend Amit Shah's tenure as party chief
Related News