మిథాలీ రాజ్‌కు పగ్గాలు

Updated By ManamFri, 08/24/2018 - 02:47
MithaliRaj
  • మాన్సికి జట్టులో చోటు.. శ్రీలంక పర్యటనకు భారత మహిళల జట్ల ఎంపిక

MithaliRajన్యూఢిల్లీ: శ్రీలంక పర్యటనకు త్వరలో వెళ్లనున్న భారత మహిళల క్రికెట్ వన్డే, టీ20 జట్లను గురువారం ఎంపిక చేశారు. పేసర్ మాన్సి జోషికి మళ్లీ చోటు దక్కింది. గతేడాది ఐసీసీ మహిళల వరల్డ్ కప్‌లో చివరిసారి పాల్గొన్న మాన్సి మోకాలి గాయంతో దాదాపు ఏడాది కాలం క్రికెట్‌కు దూరమైంది. ఇటవల మహిళల చాలెంజ్ ట్రోఫీలో మళ్లీ ఆమె మైదానంలోకి అడుగుపెట్టింది. శ్రీలంకలో జరిగిన ఐసీసీ వుమెన్స్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు 3 వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడుతుంది. వన్డే మ్యాచ్‌లో సెప్టెంబర్ 11, 13, 16వ తేదీల్లో గాలే, కతునాయకే వేదికల్లో జరగనుండగా.. 19, 21, 22, 24, 25 తేదీల్లో టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. 

ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌కు భారత జట్లు
వన్డే జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), స్మృతి మంధన, పూనమ్ రౌత్, దీప్తీ శర్మ, డి. హేమలత, జెమీమా రొడ్రిగ్వెస్, వేద కృష్టమూర్తి, తన్య భాటియా (వికెట్ కీపర్), ఎక్తా బిస్ట్, పూనమ్ యాదవ్, రాజేశ్వరీ గైక్వాడ్, ఝులన్ గోస్వామి, మన్సి జోషి, శిఖ పాండేజ. టీ20 జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధన (వైస్ కెప్టెన్), మిథాలీ రాజ్, వేద కృష్టమూర్తి, జెమీమా రోడ్రిగ్వెస్, డి. హేమలత, దీప్తి శర్మ, అనుజ పాటిల్, తన్య భాటియా (వికెట్ కీపర్), పూనమ్ యాదవ్, ఎక్తా బిస్ట్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, శిఖ పాండే, మాన్సి జోషి. 

English Title
Mithali Raj's revenge
Related News