కిడారి మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి

Updated By ManamMon, 09/24/2018 - 09:30
MLA Kidari Sarveswara Rao post mortem completed
  • పాడేరుకు కిడారి మృతదేహం తరలింపు

MLA Kidari Sarveswara Rao body post mortem completed

పాడేరు : మావోయిస్టుల కాల్పుల్లో మృతి చెందిన ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తియింది. అరకు ప్రభుత్వ ఆస్పత్రిలో శవ పరీక్షలు పూర్తి చేసి మృతదేహాలను తరలిస్తున్నారు. ఎమ్మెల్యే కిడారి మృతదేహాన్ని పాడేరులోని క్యాంప్ కార్యాలయానికి, . సివేరి సోమ మృతదేహాన్ని బట్టివలస తరలిస్తున్నారు. 

సరిహద్దుల్లో అలర్ట్ !
విశాఖ జిల్లా అరుకు ఎమ్మేల్యే, మాజీ ఎమ్మెల్యేలపై మావోయిస్టుల దాడితో విజయనగరం జిల్లాలో పోలీస్ శాఖ అలెర్ట్ ప్రకటించింది. జిల్లా సరిహద్దుల్లో ఎటువంటి మావోయిస్టు కదలికలు లేకపోయినా డుంబ్రిగూడలో జరిగిన ఘనట నేపధ్యంలో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. సరిహద్దు గ్రామాల నుంచి జిల్లాలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.

వాహనాల్లో ప్రయాణించే వారి లైసెన్సులు, ఆధార్, ఓటరు కార్డు వంటి వాటి పై ఆరా తీస్తున్నారు. ఆంధ్ర-ఓడిస్సా సరిహద్దులు కలిగిన పాచిపెంట మండలం పీకోన వలస చెక్ పోస్టు, కూనేరు-రాయగడ రోడ్, పార్వతీపురంలోని వెంక మ్మపేట కూడలి వద్ద వాహనాల తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు.

పోలీసులు ఆయుధాలను చేతబూని వాహనాల తనిఖీలు చేపట్టడంతో  ప్రజల్లో ఒకింత అలజడి కలిగింది. విజయనగరం జిల్లాతో సరిహద్దు కలిగిన విశాఖ జిల్లా అరుకుకు అత్యంత సమీపంలో ఈ ఘాతుకం జరగడంతో పోలీస్‌లు అప్రమత్తమయ్యారు. స్థానిక ప్రజా ప్రతినిధులను అలెర్టు చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించవద్దని వారికి సూచించారు. అంతే కాకుండా నేతలకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు భద్రతను మరింత పెంచినట్టు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.

English Title
MLA Kidari Sarveswara Rao body post mortem completed
Related News