ఒక్క వీడియో క్లిప్ చూపిస్తే రాజీనామా చేస్తా!

Updated By ManamTue, 03/13/2018 - 14:08
MLA SV Mohan Reddy

MLA SV Mohan Reddy Challange

అమరావతి: అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి.. ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయినప్పుడు లోపలికి వెళ్లి కాళ్లు పట్టుకొని.. భయటికొచ్చి విరోచితాలు పలుకుతారా?. అంటూ ఆయన తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. మోదీకి వ్యతిరేకంగా జగన్ ఒక్క మాట ఎందుకు మాట్లాడట్లేదంటూ ఎస్వీ సూటి ప్రశ్న సంధించారు. మోదీని హోదా అడిగినట్లు ఒకే ఒక్క క్లిప్పింగ్ చూపిస్తే శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.

" కేంద్రం ప్రభుత్వం ఏపీకిచ్చిన హామీలు ఎందుకు అమలు చేయట్లేదు. కేంద్రంలో వైసీపీతో లాలూచి పడిందా?. ప్రత్యేక హోదా మీద వైసీపీ ధర్నాలు చేసింది.. నేతలు అసెంబ్లీలో మాట్లాడారు.. ప్రతీరోజు పాదయాత్రలో హోదాపై జగన్ మాట్లాడుతున్నారు.. ఒక్కరోజైనా ప్రధాని నరేంద్ర మోదీ గురించి మాట్లాడారా?. మోదీని జగన్ ఎందుకు విమర్శించరు?. ప్రత్యేక హోదా తేవాల్సిన బాధ్యత చంద్రబాబుదే అని జగన్ అంటున్నారు.. అసలు హోదా ఇచ్చేది ప్రధానమంత్రా..? లేదా సీఎం చంద్రబాబు నాయుడా?. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా?. ప్రధానిని విమర్శించడానికి జగన్ ఎందుకు భయపడుతున్నారు?. ప్రత్యేక హోదా కావాలని జగన్ ఎందుకు అడగలేకపోతున్నారు. కేసులకు భయపడి జగన్ అడగలేకపోతున్నారా?. రాష్ట్రపతికి మద్దతిచ్చినప్పుడు హోదా ఇవ్వాలని లేకుంటే మద్దతివ్వమని భేషరతుగా ఎందుకు చెప్పలేకపోయారు?. ప్రధానికి సలాం కొట్టి.. చంద్రబాబును విమర్శించడం పద్ధతి కాదు. జగన్ ఇంకా రాజకీయాల్లో తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఢిల్లీకి 29 సార్లు వెళ్లారు" అని ఎస్వీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

English Title
MLA SV Mohan Reddy Challange
Related News