సీఎంపై ఎస్వీ మోహన్ రెడ్డి పొగడ్తల వర్షం..

Updated By ManamTue, 03/13/2018 - 13:25
MLA SV Mohan Reddy On CM

MLA SV Mohan Reddy On CM Chandrababuఅమరావతి: బడ్జెట్‌లో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. సర్వేజన సుఖినో భవతు అన్నట్లుగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం చాలా సంతోషం అన్నారు. ఇవాళ ఏపీకి ఇంత పెద్ద ఎత్తున కంపెనీలు వస్తున్నాయంటే దానికి కారణం సీఎం చంద్రబాబేనన్నారు. కేవలం 21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతినిచ్చే సింగిల్ విండో విధానం తీసుకురావడంతో ఏపీకి  పరిశ్రమలు క్యూ కడుతున్నాయన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై ఎస్వీ మోహన్ రెడ్డి పొగడ్తల వర్షం కురిపించారు.

"కంపెనీలకు కావాల్సిన పొలాలు ఎన్ని ఎకరాలు కావాలో.. అన్ని ఎకరాలను వారి అనువుగా ఉండే రేట్లకే ఇవ్వడం జరిగింది. క్విడ్ ప్రోకోవిధానం లేకుండా పొలాలివ్వడం జరిగింది. వేల ఎకరాలు ఇచ్చినప్పటికీ ఎక్కడా ఎలాంటి క్విడ్ ప్రో జరగలేదనే విమర్శకు సీఎం చంద్రబాబు తావివ్వలేదు. రాష్ట్రం విడిపోయి ఐదేళ్లయితే.. వైసీపీ అధినేత జగన్ పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి ఐదేళ్లు పట్టింది. 20 టేబుళ్లు, నాలుగు కుర్చీలు పెట్టే వైసీపీ ఆఫీస్ పెట్టడానికి అంత సమయం పడితే.. రాష్ట్రంలో పరిశ్రమలు రాత్రి రాత్రికి వస్తాయా!?. అమరావతి కట్టాలంటే తొందరగా అవుద్దా?. అప్పటికీ  190 రోజుల్లో అసెంబ్లీ, ఏడాదిలో సెక్రటరీ కట్టి అధికారులను ఇక్కడికితీసుకొచ్చి పరిపాలన సాగిస్తున్నారు. హైదరాబాద్‌‌లో ఐటీ ఈ స్థాయిలో ఉందంటే కేవలం సీఎం చంద్రబాబు వల్లే నని మంత్రి కేటీఆర్ మెచ్చుకున్నారు" అని ఎస్వీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

English Title
MLA SV Mohan Reddy On CM Chandrababu | AP Assembly Sessions
Related News