పరిశ్రమల ఆధునికీకరణ తప్పదు

Updated By ManamWed, 03/14/2018 - 23:13
suresh-prabhu-reu

suresh-prabhu-reu-న్యూఢిల్లీ: నూతన పారిశ్రామిక విధానం ఇప్పుడున్న పరిశ్రమల ఆధునికీకరణపై దృష్టి కేంద్రీకరించడంతోపాటు, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అధునాతన టెక్నాలజీలను ముందుకు తీసుకెళ్ళేందుకు తోడ్పడుతుందని వాణిజ్య, పరిశ్రమల మంత్రి సురేశ్ ప్రభు అన్నారు. పారిశ్రామిక విధాన ముసాయిదాను మంత్రిత్వ శాఖ ఇప్పటికే విడుదల చేసి, దానితో ప్రమేయం ఉన్నవారి అభిప్రాయాలు కోరింది. కొత్త పరిశ్రమలు రావడం వల్ల ఇప్పుడున్న పరిశ్రమలు ఏమవుతాయి? మొదటి అడుగుగా ప్రస్తుతమున్న పరిశ్రమలను ఆధునికీకరించడంపై మా విధానం దృష్టి కేంద్రీకరిస్తుంది అని ఆయన ఇక్కడ ఎ.ఐ.ఎం.ఎ కార్యక్రమంలో అన్నారు. పారిశ్రామిక విప్లవం 4.0 కారణంగా వచ్చిన మార్పులపై స్పందించేందుకు ముందుకు రావలసిందిగా మంత్రి పరిశ్రమలను కోరారు.  స్మార్ట్ వస్తూత్పత్తికి పర్యాయపదంగా పారిశ్రామిక విప్లవం 4.0ను వాడుతున్నారు. ఇది సైబర్-ఫిజికల్ సిస్టంలు, ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,క్లౌడ్ కాంపుటింగ్, కాగ్నిటీవ్ కాంపుటింగ్‌లతో కూడి ఉంటుంది. ఈ టెక్నాలజీల ప్రవేశం ఉద్యోగాలపై ప్రభావం చూపవచ్చనే భయాల గురించి ప్రస్తావిస్తూ మంత్రి, ఈ కొత్త టెక్నాలజీలు ఉపాధి కల్పనకు సంబంధించి ఒక రంగంలో కొన్ని పర్యవసానాలకు పురికొల్పవచ్చు. మరికొన్ని ఇతర రంగాల్లో ఉద్యోగావకాశాలు అపారంగా కల్పించవచ్చునని అన్నారు. పైగా, రానున్న ఏళ్ళలో భారతదేశపు ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ అవెురికన్ డాలర్లకు చేరుకుంటుందని, ఇందులో 20 శాతం వస్తూత్పత్తి రంగం నుంచే వస్తుందని భావిస్తున్నారని ఆయన చెప్పారు. ఇప్పుడున్న పరిశ్రవులను ఆధునికీకరిస్తూనే, కొత్త పరిశ్రవులైపెన కూడా మనం దృష్టి కేంద్రీకరించా లని, రేపటి వృద్ధికి అవే చోదక శక్తులుగా పనిచేస్తాయని సురేశ్ ప్రభు అన్నారు. 

English Title
The modernization of industries is wrong
Related News