మోదీ మోడి

Updated By ManamSat, 04/14/2018 - 01:30
MODI

పార్లమెంట్ సమావేశాలు విజయవంతంగా నిర్వహించడంలో విఫలమైన ప్రధాని నరేంద్ర మోదీ అందుకు ప్రాయశ్చిత్తంగా గురువారం నిరాహార దీక్ష చేపట్టారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా నడవకుండా కాంగ్రెస్ పార్టీ విఘ్నం కలిగించినందుకు నిరసనగా ఆయన ఈ దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ అప్రజాస్వామిక వ్యవహార సరళిని, విభజన రాజకీయాలను, అభివృద్ధి వ్యతిరేక కార్యక్రమాన్ని ఎండ గట్టడం కోసం ఒక రోజంతా ప్రధాని నిరాహార దీక్ష చేపట్టారు. పార్లమెంట్ సమా వేశాల తీరుపై లోక్‌సభ నాయకుడిగా ఉన్న ప్రధాని నిరసన తెలపడం ఒక వింత కాగా రోజువారీ అధికారిక విధులు నిర్వహిస్తూనే ఉపవాసం ఉంటాననడం మరో కొత్త వింత. మార్చి 15 నుంచి ఏప్రిల్ 6 వరకు జరగాల్సిన మలివిడత పార్ల మెంట్ బడ్జెట్ సమావేశాలు తీవ్ర ప్రతిష్ఠంభనల మధ్య పూర్తిగా వాయిదాల మధ్య ముగిసింది. ప్రత్యేక హోదా, విభజన హామీలను ఏ మాత్రం పట్టించుకోని ఎన్డీ సర్కార్‌పై ఆంధ్రప్రదేశ్‌లోని అధికార, ప్రతిపక్షాలు రెండూ అవిశ్వాస తీర్మా నాలు ప్రతిపాదించాయి. లోక్‌సభ జరిగినన్ని రోజులూ టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలు అవిశ్వా స నోటీసులిచ్చినా మోదీ సర్కారు సుతరామూ అంగీకరించలేదు. సభలో ఆర్డర్ లేదన్న సాకుతో స్పీకర్ తిరస్కరించడం ఒక ప్రహసనంలా నడిచింది. రో జూ నిరసన ప్రదర్శనల మధ్య లోక్‌సభ  రోజూ వాయిదా పడింది. చివరికి ఆంధ్రప్రదేశ్ పార్టీల అవిశ్వాసాలకు సిపిఎం, సిపిఐ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు సైతం మద్దతు తెలియజేశాయి. ప్రతిపక్షాలన్నీ కలసి కేంద్రంపై తామే అవిశ్వాస నోటీసు  లిచ్చినా మోదీ ప్రభుత్వం చర్చకు ముందుకు రాలేదు. ప్రభుత్వంపై ఇన్ని పార్టీలు అవిశ్వాసం వెలిబుచ్చినా ఓటమి భయం కారణంగా మోదీ సర్కారు అందుకు సిద్ధపడలేదు. ఒక బాధ్యత గల ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంపై సభలో చర్చకు అనుమతించి సభ విశ్వాసం పొందాలి. పైగా తన మొండితనంతో లోక్‌సభ సమా వేశాల విలువైన సమయాన్ని, దేశ అవసరాలు తీర్చే చట్టాలను రూపొందించ కుండా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని సర్కారు వృథా చేసింది. 

ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన తెలపడం ప్రతి ఒక్కరి హక్కు. అయితే చట్ట సభలను ధర్నాచౌక్‌లు, నిరసన కేంద్రాలుగా మార్చితే విధాన నిర్ణయాలు తీసుకోవాల్సిన సభలు ప్రతిష్ఠంభనకు గురికావడం వల్ల దేశ ఆర్థిక, రాజకీయ, దౌత్య సంబంధిత పురోభివృద్ధి కుంటుపడుతుంది. ప్రతిపక్షాలు ప్రభుత్వ వ్యతిరేక పోరాటం చేయవలసిన ప్రజాపోరాట రంగంలో నిష్క్రియాపరత్వానికి గురయ్యా యి. అదే సమయంలో విధాన నిర్ణయాలు తీసుకోవలసిన చట్టసభలలో నిరసనలు చేపట్టి ప్రజల్ని ప్రేక్షకులుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాలు రెండూ ప్రజా సమస్యల్ని గాలికి వదిలి మొండిగా వ్యవహరిస్తూ దేశ ప్రగతికి ఆటంకంగా మారాయి. మోదీ ప్రభుత్వం తన తప్పేమీ లేనట్లు ప్రతి పక్షాల అప్రజాస్వామిక ధోరణులపై నిరశన దీక్ష చేపట్టడం విడ్డూరం. మొత్తం 545 మంది సభ్యలున్న లోక్‌సభలో ప్రతి రోజూ వెల్‌లోకి వెళ్ళి ఆందోళన చేసిన ఎఐఎడిఎంకె, టిఆర్‌ఎస్ రెండు పార్టీల బలం 40కి లోపే. అదీకాక చివరి నాలుగైదు రోజుల్లో టిఆర్‌ఎస్ వెనకంజ వేసింది. ఈ రెండు పార్టీలను వెల్‌లోకి రాకుండా నియంత్రించడం బీజేపీకి పెద్ద సమస్యేమీ కాదు. అవిశ్వాస తీర్మానాన్ని అడ్డుకునేందుకే ఒక పథకం ప్రకారమే ఈ రెండు పార్టీలతో బీజేపీ లొల్లి చేయిం చిందనే విమర్శలు లేకపోలేదు. కర్ణాటక ఎన్నికల కారణంగా ఎఐఎడిఎంకె డిమాండ్ చేస్తున్నట్లు కావేరీ నిర్వహణ మండలి వేయడానికి బీజేపీ తట పటాయిస్తూ సుప్రీం కోర్టును మరొక వాయిదా కోరింది. ఈ గందరగోళం మధ్యనే బీజేపీ ప్రభుత్వం కొన్ని బిల్లులను ఏకపక్షంగా ఆమోదించడం ప్రజాస్వామ్యానికే అప్రతిష్ట. టీఆర్ ఎస్, ఏఐడిఎంకెల ద్వారా లోక్‌సభ సమావేశాలను ప్రతిష్ఠంభనకు గురిచేసే ఎత్తుగడను బీజేపీ చేపట్టింది. బీజేపీ అవకాశవాదమే రాజ్యసభ, లోక్‌సభలో గందరగోళానికి ప్రధాన కారణం. దీన్ని కప్పిపెట్టేందుకు ప్రతిపక్షాలపై ఆరోపణలు, విమర్శలు, అందుకు నిరసనగా ఉపవాస దీక్షలు బీజేపీ నిర్వహించడం హాస్యాస్పదం. అధికారంలో ఉండే పార్టీ తాను నిర్వహించాల్సిన బాధ్యత నిర్వహించ లేకపోవడానికి ప్రధాన కారణం స్వయం కృతమే. కానీ ప్రతిపక్షాల వల్ల సభా నిర్వహణ కుంటుపడిందంటే దానికి అధికార పక్షమే ప్రధాన బాధ్యత వహించాలి. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజ్యాంగంపై, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై దాడి చేస్తూనే ఉంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలుగానీ, జమిలి ఎన్నికల ప్రస్తావనగానీ, ప్రణాళికా సంఘాలన్ని రద్దుచేసి నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేయడంగానీ, ఎలక్టోరల్ బాం డ్లు, 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదించిన సిఫారసులు, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి విధానాలన్నీ దేశ రాజ్యాంగానికి, ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలిగించేవే. గో రక్షక సంఘాల అకృత్యాలు, మత విద్వేష మారణకాండలు, సంఘ్ పరివార్ శక్తుల వికృత చేష్టలు, లౌకికవాదులే, మేధావులు, రచయితలను మట్టుపెట్టడం, ఉనా వో, జమ్మూలో మైనర్ బాలికలైపై అకృత్యాలకు పాల్పడిన ఉదంతాలు, ఎస్సీ, ఎస్టీ లపై దాడులు వంటి అనేక అప్రజాస్వామిక చర్యల ద్వారా సామాజిక బహుళ త్వానికి విఘాతం కలిగించే విధంగా బీజేపీ ప్రభుత్వాల పాలన సాగుతోంది. ఈ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరలించేందుకు, వారిని మంత్రముగ్ధుల్ని చేసేం దుకు మోదీ నిర్వహిస్తున్న నిరశన మోడి (గారడి) ఫలించడం సందేహమే!

Tags
English Title
Modi Modi
Related News