షమీ భార్యకు కోపమొచ్చింది.. మీడియా కెమెరా పగిలింది

Updated By ManamTue, 03/13/2018 - 21:50
hasin jahan

shami wifeకోల్‌కతా: తన భర్త తనను వేధిస్తున్నాడంటూ వార్తల్లో నిలిచి సంచలనానికి తెరలేపిన క్రికెటర్ షమీ భార్య హసిన్ జహన్ కోల్‌కతాలో మీడియా సిబ్బందితో దురుసుగా ప్రవర్తించింది. మీడియా ప్రతినిధిని చూడగానే ఒక్కసారిగా సహనాన్ని కోల్పోయి.. ఆగ్రహంతో ఊగిపోయింది. ఓ మీడియా ప్రతినిధి కెమెరాను ధ్వంసం చేసి, మీడియా సామాగ్రిని ధ్వంసం చేసింది. మీడియా సిబ్బందిపై కేకలేస్తూ రుసరుసలాడింది. ఈమె దురుసు ప్రవర్తన వల్ల ఓ మీడియా సిబ్బందిలోని ఒకరికి చిన్నపాటి గాయమైంది. ఆమె ప్రవర్తనపై జర్నలిస్టులు మండిపడుతున్నారు.

English Title
Mohammed Shami's wife Hasin Jahan assaults media personnel in Kolkata
Related News