మోహన్‌బాబు కుటుంబంలో విషాదం

Updated By ManamThu, 09/20/2018 - 09:11
Mohan Babu
Mohan Babu

ప్రముఖ టాలీవుడ్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబుకు తల్లి మంచు లక్ష్మమ్మ(85)కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తిరుపతిలో శ్రీవిద్యానికేతన్‌లో గురువారం ఉదయం 6గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం మోహన్ బాబు, ఆయన  కుటుంబసభ్యులు అమెరికాలో ఉండగా.. వార్త తెలుసుకున్న వారు హుటాహుటిగా భారత్‌కు పయనమయ్యారు. ఆమె అంత్యక్రియలు శుక్రవారం తిరుపతిలో నిర్వహించనున్నారు. కాగా తన తల్లిపై ఉన్న ప్రేమతో ఆమె పేరును మోహన్ బాబు తన కుమార్తెకు కూడా పెట్టిన విషయం తెలిసిందే.

English Title
Mohan Babu's mother expired
Related News