మోదీతో ప్రముఖ నటుడు మోహన్ లాల్ భేటీ

Updated By ManamTue, 09/04/2018 - 16:09
mohan lal met narendra modi
mohan lal met narendra modi

న్యూఢిల్లీ : ప్రముళ మలయాళ నటుడు మోహన్ లాల్ నిన్న (సోమవారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన కేరళ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. ఈ నేపథ్యంలో నవ కేరళ నిర్మాణంపై నిర్వహించే ప్రపంచ మలయాళీ రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొనవలసిందిగా మోహన్ లాల్ ఈ సందర్భంగా ప్రధానిని కోరారు. 

కాగా సమావేశంలో పాల్గొంటానని ప్రధాని అంగీకరించినట్లు మోహన్ లాల్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. కృష్ణాష్టమి రోజున ప్రధాని మోదీని కలిసినట్లు ట్వీట్‌ చేసిన మోహన్ లాల్ తాను నిర్వహించే విశ్వశాంతి ఫౌండేషన్ కార్యకలాపాల గురించి వివరించినట్టు పేర్కొన్నారు. అలాగే కేరళను అన్నివిధాలుగా సాయం చేస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

మరోవైపు మోహన్ లాల్ బీజేపీలో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆయన... కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీమంత్రి శశి థరూర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువనంతపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే తన పొలిటికల్ ఎంట్రీపై మోహన్ లాల్ మాత్రం పెదవి విప్పడం లేదు.

English Title
Mohanlal met narendra modi
Related News