విట్‌జిగ్ చేతికి ‘మోర్’

Updated By ManamFri, 09/21/2018 - 22:12
Aditya Birla Company

moreన్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా కంపెనీ నిర్వహిస్తున్న గొలుసుకట్టు స్టోర్‌ల సముదాయం ‘మోర్’  సూపర్ మార్కెట్లను సమారా ఆల్ట్రర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌కి చెందిన విట్‌జిగ్ అడ్వైజరి సర్వీస్ స్వాధీనం చేసుకుంది. అయితే అది ఎంత మొత్తానికి స్వాధీనం చేసుకున్నది మాత్రం వెల్లడించలేదు. ఆదిత్య బిర్లా గ్రూపు(ఏబీఆర్‌ఎల్)నకు చెందిన ఆర్‌కేఎన్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ కనిష్ఠ్ ఫినాన్స్ లిమిటెడ్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఏబీఆర్‌ఎల్‌తో కలిసి విట్‌జిగ్‌తో వాటా కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా 99.99 శాతం వాటాను విట్‌జిగ్ సొంతం చేసుకుంది. ఈ ఒప్పందానికి పలు రకాల అనుమతులు లభించాల్సి ఉంది. దాదాపు 44.3 బిలియన్ డాలర్ల విలువ కలిగిన  ఆదిత్య బిర్లా గ్రూపు  ‘మోర్’ బ్రాండ్ పేరుతో సూపర్ మార్కెట్, హైపర్ మార్కెట్ వంటి రెండు విభాగాల్లో గొలుసు కట్టు దుకాణాలను నిర్వహిస్తోంది. దానికి దేశ వ్యాప్తంగా 523 స్టోర్లు ఉన్నాయి.  ఆహార, వంట సామగ్రి రిటైల్ వ్యాపారాల్లో ఉన్న త్రినేత్ర సూపర్ రిటైల్‌ను  ఏబీఆర్‌ఎల్ వెంచర్ 2007లో స్వాధీనం చేసుకుంది. తర్వాత దేశమంతటా దాని స్టోర్‌లను విస్తరిస్తూ వచ్చింది. గొలుసు కట్టు దుకాణాల వ్యాపార సంస్థల్లో ఫ్యూచర్ గ్రూపు, రిలయన్స్ రిటైల్, డీ-మార్ట్‌ల తర్వాత మోర్ సూపర్ మార్కెట్ నాలుగో స్థానంలో ఉంది. 

English Title
'Mor' to wit gig hand
Related News