ఇంట్రస్టింగ్: పోర్న్‌ను దాటేసిన ఆధార్!

Updated By ManamMon, 03/19/2018 - 17:26
porn

aadharనీలిచిత్రాలను వీక్షించే వారు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉంటారు. ఇంటర్నెట్‌లో ఎక్కువగా శోధించే విషయాల్లో పోర్న్ ముందు వరుసలో ఉంటుంది. అయితే భారతీయులు మాత్రం ఇప్పుడు పోర్న్ వెబ్‌సైట్ కంటే ఆధార్ వెబ్‌సైట్ గురించే ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారట. వెబ్‌సైట్ స్టాటిస్టిక్స్ సంస్థ అలెక్సాలో ఈ విషయం వెల్లడైంది. భారతదేశంలో ఎక్కువ మంది పోర్న్ చూసేందుకు సెర్చ్ చేసే ఓ వెబ్‌సైట్ కంటే యూఐడీఏఐ వెబ్‌సైట్ ముందు వరుసలో ఉందట. ఆ పోర్న్ వెబ్‌సైట్ మోస్ట్ సెర్చింగ్ లిస్ట్‌లో 16వ స్థానంలో ఉంటే, ఆధార్ వెబ్‌సైట్ 15వ స్థానంలో ఉండటం విశేషం. అయితే దీనికి కారణం లేకపోలేదు. ఆధార్ కార్డును మొబైల్ నంబర్‌కు, బ్యాంకు సేవలకు అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఎక్కువ మంది వివరాల కోసం ఆధార్ గురించి శోధించారు. అయితే పోర్న్ వెబ్‌సైట్‌ను వీక్షించే సమయంతో పోలిస్తే ఆధార్ వెబ్‌సైట్‌ను వీక్షించిన సమయం తక్కువనే చెప్పక తప్పదు. ప్రపంచంలోనే పోర్న్ ఎక్కువగా వీక్షించే దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. భారత్‌లో పోర్న్ చూసేందుకు సెర్చ్ చేస్తున్న ఓ వెబ్‌‌సైట్ వర్డ్‌వైడ్ అలెక్సా ర్యాంకింగ్స్‌లో 38వ స్థానంలో ఉంది.

English Title
More Indians Are Searching For Aadhaar's Website Than Porn On The Internet Right Now
Related News