అక్టోబర్‌లో ‘అనగనగా ఓ ప్రేమకథ’

Updated By ManamSat, 09/08/2018 - 01:55
anaganagaa prema katha

imageప్రముఖ నిర్మాత డి.వి.ఎస్ రాజుఅల్లుడు కె.ఎల్.ఎన్.రాజు  ఫైనాన్సియర్‌గా సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నారు. ఈయన నిర్మాతగా థౌజండ్ లైట్స్ మీడియా  ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్యానర్ ను స్థాపించి ‘అనగనగా ఓ ప్రేమకథ’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని వరుణ్ తేజ్ ట్విట్టర్ ద్వారా విడుదల చేసి యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా  నిర్మాత కె.ఎల్.ఎన్ రాజు మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ధ్వారా నూతన హీరో హీరోయిన్‌లను పరిచయం చేస్తున్నాం. అలాగే ప్రతాప్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.  చిత్రం తొలి ప్రచార చిత్రాన్ని వరుణ్ తేజ్ గారు ఆవిష్కరించారు. ఆయనకు కృతజ్ఞతలు. ఈ చిత్రాన్ని అక్టోబర్ నెలలో విడుదల చేయటానికి సిద్ధం చేస్తున్నాం. హీరోగా ప్రముఖ ఎడిటర్ మార్తాండ్.కె . వెంకటేష్‌గారి మేనల్లుడు విరాజ్ జె అశ్విన్‌ను పరిచయం చేస్తున్నాం. హీరోయిన్స్‌గా రిద్ధి కుమార్,  రాధా బంగారు నటిస్తున్నారు’’ అన్నారు.

English Title
movie anaganagaa prema katha
Related News