రాజీనామాల పేరుతో జగన్ నాటకం: జేసీ

Updated By ManamTue, 02/13/2018 - 18:46
jc

jcఅమరావతి: ప్రత్యేక హోదాపై కేంద్రం ఏప్రిల్ 6లోపు స్పష్టమైన ప్రకటన చేయాలని.. అప్పటికీ స్పందించకపోతే తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని వైఎస్ జగన్ చేసిన ప్రకటనను టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. జగన్ ఎంపీల రాజీనామా పేరుతో నాటకమాడుతున్నారని జేసీ మండిపడ్డారు. రెండేళ్ల క్రితం రాజీనామాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. మళ్లీ ఇప్పుడు రాజీనామాలంటే ఎవరు నమ్ముతారని జేసీ జగన్‌ను నిలదీశారు. రాజీనామాలు ఆమోదించే సరికి 2నెలలు పడుతుందని, ఈలోగా సాధారణ ఎన్నికలొస్తాయని జేసీ జోస్యం చెప్పారు. రాజీనామాలు ఉత్తవేనని, అంత ప్రభావం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. పోరాటంలో వెనకబడ్డానని జగన్ రాజీనామాల నాటకానికి తెర లేపారని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విమర్శించారు. మరో ఎంపీ కొనకళ్ల కూడా జగన్ రాజీనామాల ప్రకటనపై విమర్శలు గుప్పించారు. పోరాటంలో వెనకబడిపోయామనే ఇప్పడు మళ్లీ జగన్ రాజీనామాలంటున్నారని విమర్శించారు. సభలో ప్రధాని ముందు ప్లకార్డ్ పట్టుకోనివాళ్లు రాజీనామా చేసి ఏం సాధిస్తారని కొనకళ్ల ఎద్దేవా చేశారు.

English Title
mp jc diwakar reddy comments on jagan mps resigns annocement
Related News