అసెంబ్లీ రద్దుపై నిర్ణయం కేసీఆర్‌దే...

Updated By ManamSun, 09/02/2018 - 11:42
MP Kavitha
MP kavitha condemns congress allegations over  Pragathi Nevadana Sabha

హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ శాసనసభ రద్దుపై తుది నిర్ణయం తీసుకునేది తమ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆరేనని ఆయన కుమార్తె ఎంపీ  కవిత స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా కొంగరకొలాన్ ప్రగతి నివేదన సభ వద్ద ఆమె ఆదివారం మాట్లాడుతూ... ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్‌ఎస్‌దే విజయమని, కేసీఆర్ నిర్ణయం కోసం అందరం ఎదురు చూస్తున్నామని అన్నారు. నాలుగున్నరేళ్ల జరిగిన ఈ సభ ద్వారా సీఎం ప్రజలకు వివరిస్తారన్నారు. 

అధికార దుర్వినియోగం అన్నది ఒట్టిమాటేనని, అవన్నీ కాంగ్రెస్ ఆరోపణలే అని ఎంపీ కవిత కొట్టిపారేశారు.  ప్రతి పనికి, ప్రభుత్వ శాఖలన్నింటికీ టీఆర్ఎస్ పార్టీ తరపున డబ్బు చెల్లిస్తున్నామన్నారు. ప్రజలకు ఓ సుస్థిరమైన పాలన ఇవ్వాలన్నదే కేసీఆర్ లక్ష్యమన్నారు. ఎన్నికలు కలిసి వచ్చినా, తర్వాత వచ్చినా తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని కవిత ధీమా వ్యక్తం చేశారు.

English Title
MP kavitha condemns congress allegations over Pragathi Nevadana Sabha
Related News