'రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తు ఉండదు‌'

Updated By ManamTue, 09/04/2018 - 21:30
Veerappa Moily, BJP, Narendra modi, Central govt, Rafale deal, Reliance Anil Ambani group
  • రఫెల్ డీల్ ద్వారా రిలయన్స్‌కు మోదీ ప్రభుత్వం  లబ్ది చేకూర్చింది 

  • కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ వీరప్ప మొయిలీ ఆరోపణ 

Veerappa Moily, BJP, Narendra modi, Central govt, Rafale deal, Reliance Anil Ambani groupవిజయవాడ: కేంద్రంలోని న‌రేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని రంగాలలో ఘోరంగా విఫలమైందని, రఫెల్ ఒప్పందం ద్వారా రిలయన్స్‌కు లబ్ది చేకూర్చిందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ వీరప్ప మొయిలీ ఆరోపించారు. మంగ‌ళ‌వారం ఆంధ్రర‌త్నభ‌వ‌న్‌లో  ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో రాజ్యస‌భ స‌భ్యలు  కె.వి.పి రామ‌చంద్రరావుతో క‌లిసి మాట్లాడారు. రక్షణరంగంలో ఇటువంటి ఒప్పందాల ద్వారా దేశ సమగ్రతకు ఇబ్బంది కలుగుతోందన్నారు. కాంట్రాక్టు 12 రోజుల ముందు అనిల్ అంబానీ కంపెనీ ఏర్పాటు చేశాడని విమర్శించారు. రూ.61 వేల కోట్ల కాంట్రాక్టును రిలయన్స్ కంపెనీ చేజిక్కుంచు కోవడంలో మోదీ కీలకపాత్ర పొషించాడని ఆరోపించారు.

ఎటువంటి అనుభవం లేని రిలయన్స్ కంపెనీకి ఈ కాంట్రాక్టు ఇవ్వడం రక్షణ రంగాన్ని నిర్వీర్యం చేయడమేనని విమర్శించారు. 126 హెలికాప్టర్లను దేశ రక్షణ కోసం కొనుగోలు చేయడానికి రక్షణ రంగం ఆమోదించింది. రాఫెల్ డీల్ ద్వారా అవినీతి ఒప్పందానికి  కేంద్రం తెరతీసిందని దుయ్యబట్టారు. మోదీ మౌనం దేనికి సంకేతం అని మొయిలీ ప్రశ్నించారు. రఫెల్ స్కాంపై ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారని చెప్పారు. ఏఐసీసీ ఆదేశాల మేర‌కు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్వర్యంలో రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రంలో  సెప్టెంబరు 12న జిల్లా కలెక్టర్ల ద్వారా  రాష్ట్రప‌తి కాంగ్రెస్ నాయకులు మెమోరాండం అందిస్తారన్నారు.

అదేవిధంగా సెప్టెంబరు 24న గవర్నర్ ద్వారా కాంగ్రెస్ తరుపున మెమోరాండం రాష్ట్రప‌తి ఇస్తార‌న్నారు. 2019 సార్వత్రిక ఎన్నిక‌ల్లో  రాష్ట్రంలో ఏ పార్టీతో కూడా ఎన్నికల పొత్తు ఉండదని స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తు అనేదే ఉండదన్నారు. కాంగ్రెస్ ఒంటరిగానే పొటీ చేస్తోందని సృష్టం చేశారు. మీడియా స‌మావేశం అనంత‌రం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ క‌మిటీ నేతలు వీరప్ప మొయిలీని ఘ‌నంగా స‌న్మానించారు.   

English Title
MP Veerappa Moily slams BJP Narendra modi govt
Related News