'సీఎం చంద్రబాబు అవకాశవాది'

Updated By ManamSun, 04/15/2018 - 15:38
CM Chandrababu naidu, Vijayasaireddy, GVMS Gandhi statue, YSRCP, deeksha camp

CM Chandrababu naidu, Vijayasaireddy, GVMS Gandhi statue, YSRCP, deeksha campవిశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు అవకాశవాదని, ఆయన అవకాశాన్ని బట్టి మాట్లాడే వ్యక్తిని  విమర్శించారు. విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆదివారం వైఎస్సార్‌సీపీ శ్రేణులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విజయసాయి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం కాదని తెలిసినప్పటికీ కూడా ప్యాకేజీనే ఇవ్వాల్సిందిగా చంద్రబాబు ఎందుకు ఒప్పుకున్నారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం తమతో కలిసివచ్చే ప్రతి పార్టీకి వైఎస్సార్‌సీపీ మద్ధతుగా నిలుస్తుందని చెప్పారు. కాగా, ప్రత్యేక హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు గత వారం రోజులుగా ఆందోళనలు, రిలే నిరాహార దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే.

English Title
MP Vijayasaireddy slams CM Chandrababu naidu
Related News