మెుక్కే రక్ష

Updated By ManamThu, 08/02/2018 - 00:38
kadiyam
  • ద్యమంలా మొక్కలు నాటాలి

  • నాటిన వాటిని రక్షించుకోవాలి

  • హరితహారం సామాజిక ఉద్యమం: కడియంఉ

kadiyamsrihariహైదరాబాద్: హరితహారం కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంగా చేపట్టాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. బుధవారం వరంగల్ అర్బన్ జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో బెస్తం చెరువు వద్ద 10ఎకరాల స్థలంలో మొక్కలు నాటి నాల్గవ విడత హరితహారం కార్యక్రమం ప్రారంభించి మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అడవుల విస్తీర్ణం 24 శాతమే ఉందని, దీనిని 33 శాతానికి పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. హరిత తెలంగాణ కావాలంటే, మన రాష్ట్రంలో పంటలు బాగా పండాలంటే, వానలు రావాలంటే, హరితహారంలో అందరూ భాగస్వామ్యమై పెద్దఎత్తున మొక్కలు నాటాలన్నారు,  తెలంగాణను హరిత తెలంగాణ చేసే ఉద్దేశ్యంతో రూపొందించిన పథకంలో భాగంగా 230కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించామని తెలిపారు. ఈ నాల్గవ విడతలో 40కోట్ల మొక్కలు నాటే లక్ష్యం నిర్థేశించారన్నారు. ఇందులో వరంగల్ ఉమ్మడి జిల్లాలో 5కోట్ల మొక్కలు నాటాలని అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలను కోరారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యే కొండా సురేఖ, జిల్లా అటవీశాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు.

మొక్కే శ్రీరామ రక్ష: మహేందర్ రెడ్డి
ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఉద్యమంలా మొక్కలు నాటాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మొక్కే పర్యావరణానికి శ్రీరామ రక్ష అని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. నాలుగో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లాకేంద్రంలోని శ్రీ అనంత పద్మనాభ కళాశాలలో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో బుధవారం హరితహారం కార్యక్రమం చేపట్టి 10 వేల మొక్కలను నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, రాష్ట్రంలో అడవులు పూర్తిగా అంతరించి పోతున్నాయని, చెట్లను అధికంగా నాటితేనే మంచి వాతావరణాన్ని సంపాదించుకుంటామని ఆయన పేర్కొన్నారు. మన రాష్ట్రంలో 24 శాతం మాత్రమే అడవులున్నాయని ఆయన తెలిపారు. వాటిని 33 శాతం వరకు తీసుకెళ్లేందుకు హరితహారం కార్యక్రమం చేపట్టినట్లు మహేందర్ రెడ్డి తెలిపారు. 

పర్యావరణ రక్షణకు పాటుపడాలి: జగదీష్‌రెడ్డి
భవిష్యత్ తరాలకు మంచి ఆరోగ్యకరమైన వాతావరణం అందించేందుకు మొక్కలు నాటాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. నాల్గవ విడుత హరితహారంలో భాగంగా బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తి దారుల సహకార సంఘం పాల శీతలీకరణ కేంద్రంలో మంత్రి మొక్కలు నాటి హరితహారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయ లని, మొక్కలు నాటడమే కాక వాటిని సంరక్షించాలని ఆయన కోరారు. ఈ సంవత్సరం 2 కోట్ల మొక్కలు నాటుతున్నామని, పాఠశాలలో మొక్కలు పంపిణీ చేస్తున్నామన్నారు.  ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, నల్లగొండ జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, తదితరులు పాల్గొన్నారు. 

పెంపకంపై మక్కువ చూపాలి: స్మిత సబర్వాల్
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నాలుగవ విడత హరితహారాన్ని  ఉద్యమంగా స్వీకరించాలని  సిఎం కార్యాలయ కార్యదర్శి స్మిత సబర్వాల్  అన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లాలో ఆమె పర్యటించారు. స్థానిక పోలీస్ హెడ్ క్వాటర్‌లో చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంటి ఆవరణంలో ఉన్న ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మొక్కలు పెంపకం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో కరీంనగర్ కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, పోలీస్ కమిషన్ విబి కమలాషన్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శశాంక్, ఆర్‌డివో రాజాగౌడ్, ఆర్‌ఐ మల్లేశం పాల్గొని మొక్కలు నాటారు.

ఆకుపచ్చ తెలంగాణగా మార్చాలి: తుమ్మల
రాష్ట్రాన్ని పచ్చని తెలంగాణగా తిర్చిదిద్దడమే హరిత హారం అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం మంత్ర రఘునాధపాలెం మండలం దానవాయిగూడెంలోని గురుకుల పాఠశాలలో 4వ విడత హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయున మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రజలందరూ స్వచ్చందంగా, ఉత్సాహంగా భాగస్వాములు కావాలి అని అన్నారు. నాటిన ప్రతి మొక్క బ్రతికేలా చూడాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్‌సి కార్పొరేషన్ పిడమర్తి రవి, రాష్ట్ర శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయుణ, ఖమ్మం జిల్లా కమిషనర్ ఆఫ్ పోలిసు తప్సీర్ ఇక్బాల్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

English Title
Mucque reserve
Related News