‘సర్కార్’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్

Updated By ManamWed, 10/10/2018 - 15:20
Sarkar

Sarkarవిజయ్ హీరోగా మురగదాస్ తెరకెక్కించిన చిత్రం ‘సర్కార్’. కీర్తి సురేశ్ ఇందులో హీరోయిన్‌గా నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్, ప్రేమ్ కుమార్, యోగి బాబు తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్ర టీజర్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. దసరా కానుకగా ఈ నెల 19న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. కాగా విజయ్, మురగదాస్ కాంబినేషన్‌లో ఇదివరకు వచ్చిన ‘కత్తి’, ‘తుపాకి’ చిత్రాలు భారీ విజయాలను సాధించడంతో సర్కార్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా.. నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

English Title
Muhurtham fixed for Sarkar teaser
Related News