పొడి చర్మానికి సూపర్ టిప్

Updated By ManamThu, 10/18/2018 - 12:21
Multani Mitti uses For Dry Skin
multani matti

పొడి చర్మం కోసం ముల్తానీ మట్టి ఎలా ఉపయోగించాలి, ఇది పొడి చర్మం కోసం ఒక అద్భుతమైన సహజసిద్ధమైన చిట్కా. ఇది ఒక సహజమైనది కాబట్టి చర్మం నుండి దుమ్ము, మలినాలను గ్రహిస్తుంది. అలాగే చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది. వీటితో పాటు వృద్ధాప్య ఛాయలు, ముడతలను, కుంగిపోయిన చర్మాన్ని, చర్మం పై వచ్చే సున్నితమైన గీతాలను రాకుండా రక్షిస్తుంది.

పొడి చర్మం కోసం ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్

  • ఒక టీస్పూన్ ముల్తానీ మట్టి, ఒక టీస్పూన్ తేనే ను కలిపి పేస్ట్ లాగా చేసి ముఖానికి పూసి ఇరవై నిమిషాల పాటు అలానే ఉంచి తర్వాత చల్లని నీళ్ళతో కడిగేయాలి.. ఇలా వారానికి ఒకసారి ముఖానికి పట్టించడం వలన ఫలితం ఉంటుంది..

  • ఒక టీస్పూన్ ముల్తానీ మిట్టి, సగం స్పూన్ గంధం పొడి, ఒకటి-రెండు టేబుల్స్పూన్లు గులాబీ నీరు అన్నిటిని కలిపి ముఖానికి పూసి ఆరిన తర్వాత గోరు వెచ్చని నీరు తో కడిగేయాలి..

  • ఒక టీస్పూన్ ముల్తానీ మిట్టి, ఒక టీస్పూన్ పెరుగు, రెండిటిని కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత గోరు వెచ్చటి నీరు తో మసాజ్ చేసి కడిగేయాలి..

  • ఒక టీస్పూన్ ముల్తానీ మిట్టి, సగం స్పూన్ పసుపు, రెండు టీస్పూన్ తేనే అన్నిటిని కలిపి ముఖానికి రాసి ఇరవై నిమిషాల పాటు అలానే ఉంచి ఆరిన తర్వాత గోరు వెచ్చని నీరు తో మసాజ్ చేస్తూ కడిగేయాలి ..

  • ఒక టీస్పూన్ ముల్తానీ మిట్టి, రెండు టీస్పూన్ బొప్పాయి గుజ్జు, ఒక టీస్పూన్ తేనే అన్నింటిని కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత గోరు వెచ్చటి నీరు తో కడిగేయాలి.

  • ఒక టీస్పూన్ ముల్తానీ మిట్టి, ఒక టీస్పూన్ నారింజ తొక్కు పొడి, ఒక టేబుల్ స్పూన్ పాలు అన్నిటిని కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత చల్లని నీరు తో కడిగేయాలి. ఇలా చేయడం వలన ముఖానికి మంచి ఫలితం ఉంటుంది.
English Title
Multani Mitti uses For Dry Skin
Related News