ముంబయి టూ కరీంనగర్

Updated By ManamWed, 09/26/2018 - 01:57
train
  • లోక్‌మాన్య తిలక్ రైలు పొడిగింపు

  • నేడు ప్రారంభించనున్న కేంద్రమంత్రి

trainకోరుట్ల: ముంబయి నుంచి నిజామాబాద్ వరకూ నడిచే వారంతపు లోక్‌మాన్యతిలక్(ఎల్టీటీ-11206) రైలు గమ్యస్థానాన్ని కరీంనగర్ వరకూ దక్షిణ మధ్య రైల్వే పొడిగించింది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తిజేశామని ఎస్సీఆర్ అధికారులు తెలిపారు. నేడు ఈ రైలును సికింద్రాబాద్ జంక్షన్ నుంచి రైల్వే మంత్రి(స్వతంత్ర) రాజన్ గొహెన్ జెండా ఊపి ప్రారంభించనున్నారని ఓ ప్రకటనలో ఎస్సీఆర్ పేర్కొంది. దీంతోపాటు ప్రయాణీకుల సౌకర్యాలు, స్టేషన్లలో ఆధునిక వసతులతోపాటు ఎస్సీఆర్‌లో మరికొన్ని అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.

చౌకగా ముంబాయి ప్రయాణం..
ఎల్టీటీ రైలును కరీంనగర్ వరకూ పొడిగించడంతో ఈ ప్రాంత వాసులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా వ్యాపారులు, ఉపాధి కోసం ఆర్థిక రాజధానికి వలస పోయే కార్మికులకు ఇది ఓ శుభవార్త అయ్యింది. ఈ రైలు కరీంనగర్ నుంచి నిజామాబాద్, బాసర, మహరాష్ట్రలోని నాందేడ్, ఔరంగాబాద్, మన్మడ్, నాసిక్ తదితర ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఎంతగానో ఉపయోగపడనున్నది. కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాలలో వ్యాపారస్తులు ఎక్కువగా ఉన్నారు. వీరు ఇక్కడ్నుంచి ముంబయికి సరుకు రవాణా చేస్తారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ వరకూ రైలును పొడిగించారు.

Tags
English Title
Mumbai to Karimnagar
Related News