నగరంలో ఘోరం.. పోలీసుల ముందే భార్యపై భర్త దాడి

Updated By ManamThu, 10/18/2018 - 13:38
Murder

Murderతనపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిందన్న కోపంతో భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు ఓ భర్త. నగరంలోని బేగంపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీస్‌స్టేషన్‌కు వెళ్తున్న భార్యతో పాటు ఆమె కుటుంబసభ్యులపైనా కొబ్బరి బోండాల కత్తితో కిరాతకంగా నరికాడు. ఆ తరువాత అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

కాగా బేగంపేట ప్రాంతంలో కౌసర్ బీ, రెహమాన్ దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే తరచూ భార్య కౌసర్ బీతో రెహమాన్ తరచూ గొడవపడేవాడు. ఆ వేధింపులు భరించలేక రెహమాన్‌పై ఫిర్యాదు చేసేందుకు కుటుంబసభ్యులతో కలిసి కౌసర్‌ బీ పోలీస్ స్టేషన్‌కు బయలుదేరింది. ఈ విషయం తెలుసుకున్న రెహమాన్.. కొబ్బరి బోండాలు నరికే కత్తితో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. మహిళా పోలీసులు అడ్డుకుంటున్నా వారి నుంచి తప్పించుకొని భార్యతో పాటు ఆమె కుటుంబసభ్యులు సల్మాన్, మస్తాన్ బేగం, షకీరా, షాహిన్‌పై దాడి చేశాడు. 

Murder

 

English Title
Murder in Hyderabad
Related News