ఇసైజ్ఞానికి పద్మ విభూషణ్ అవార్డు

Updated By ManamTue, 03/20/2018 - 19:17
iraja

i1న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతితో పాటు ప్రధాని కూడా హాజరయ్యారు. సంగీత దర్శకుడు ఇళయరాజాకు పద్మ విభూషణ్‌ను రాష్ట్రపతి ప్రదానం చేశారు. క్రికెటర్ ధోనీకి పద్మభూషణ్ దక్కింది. సంగీత విభాగంలో గులాబ్ ముస్తఫాఖాన్‌కు పద్మ విభూషణ్, సాహిత్యరంగంలో పరమేశ్వరన్‌కు పద్మ విభూషణ్, షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు పద్మశ్రీ, టెన్నిస్ ప్లేయర్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్‌కు పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఎల్‌కే అద్వానీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పద్మ విభూషణ్ అందుకోవడంపై సంగీత దర్శకుడు ఇళయరాజా సంతోషం వ్యక్తం చేశారు. ఇళయరాజా జూన్ 2, 1943లో తమిళనాడులోని మధురై జిల్లా పన్నైపురంలో జన్మించారు. తన 30ఏళ్ల సినీ ప్రస్థానంలో దాదాపు 5వేల పాటలకు, 1000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఉత్తమ సంగీత దర్శకుడిగా నాలుగుసార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. 

English Title
Music Composer Ilaiyaraaja receives Padma Vibhushan
Related News