మ్యూజిక్ వెకేషన్

Updated By ManamThu, 08/02/2018 - 02:42
Music Vacation

దేశ విదేశీ ఆర్టిస్టుల లైవ్ పర్‌ఫార్మెన్స్‌తో పాటు కాస్త సేదతీరి, మంచి టూరిస్ట్ స్పాట్‌లో చక్కర్లు కొట్టి రావాలంటే స్వామికార్యం స్వకార్యం రెండూ తీర్చే వేదికలు, వేడుకలు కావాలి. ఇందుకు ఫుడ్ ఫెస్టివల్, డ్యాన్స్ ఫెస్ట్, లిటరేచర్ ఫెస్ట్, కల్చరల్ ఫెస్ట్, బీచ్ ఫెస్ట్, డెజర్ట్ ఫెస్ట్ వంటి సాకులు ఉంటే మీ వెకేషన్ మరింత ఆహ్లాదంగా మారడం ఖాయం. అందుకే మనవాళ్లు ఇలాంటి సెలబ్రేషన్స్‌ను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. ఫ్రెండ్స్‌తో లేదా కుటుంబ సమేతంగా వెళ్లేందుకైనా ఇవి మంచి డెస్టినేషన్స్‌గా ఊరిస్తున్నాయి. మనదేశంలో మ్యూజిక్ ఫెస్టివల్స్‌ను ఎంజాయ్ చేసేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కాస్మోపాలిటన్ కల్చర్‌ను అక్కున చేర్చుకునే యువత సంఖ్య ఎక్కువగా ఉండడంతో మ్యూజిక్ ఫెస్ట్ ఇప్పుడు దేశమంతా జరుగుతున్నాయి. మనదేశంలో బెస్ట్ మ్యూజిక్ ఫెస్ట్‌లుగా పేరుగాంచిన  కొన్ని వెన్యూలు మీకోసం..  

జీరో ఫెస్ట్
imageదీన్ని బిగ్గెస్ట్ ఔట్‌డోర్ మ్యూజిక్ ఫెస్టివల్‌గా మనదేశంలో భావిస్తారు. మ్యూజిక్, ఆర్ట్, కల్చర్‌ల సంగమంగా ఇది సాగుతుంది. నిజానికి 4 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌ను ‘మ్యూజిక్ వెకే’గా పిలుస్తారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని ‘జీరో వ్యాలీ’లో దీన్ని ఏటా సెప్టంబర్‌లో నిర్వహిస్తారు.


రోడ్ టు అల్ట్రా
ఇది గ్లోబల్ ఎలెక్ట్రానిక్ మ్యూజిక్ ఫెస్టివల్ .. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఎలెక్ట్రిక్ డైసీ కార్నివాల్ (ఈడీసీ)గా పాప్యులర్ అయిన ఈ పండుగకు సంగీత ప్రియులు పోటెత్తుతారు. ఢిల్లీ సమీపంలోని బుద్ధా ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో నవంబర్ 12వ తేదీన జరిగే ఈ షోకు బుకింగ్ అప్పుడే స్టార్ట్ అయింది. 


ఎన్‌హెచ్7 వీకెండర్image
భలే ఇంట్రెస్టింగ్ పేరు అనిపిస్తోందా? బెంగళూరు, కోల్‌కతా, మేఘాలయా, పూనె, నోయిడాల్లో ఏటా జరిగే ఈ సంగీత పండుగలో ఈ ఏడాది అమిత్ త్రివేది, ప్రతీక్, విశాల్ భరద్వాజ్ వంటి ప్రముఖ కళాకారులు అలరించనున్నారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో జరిగే ఈవెంట్స్‌కు టికెట్స్ అందుబాటులో ఉన్నాయి.


సన్‌బర్న్ ఫెస్ట్
పార్టీ అండ్ మ్యూజిక్ లవర్స్‌కు స్వర్గధామంగా, కేరాఫ్‌గా మారిన సన్‌బర్న్‌కు మనదేశంలో మంచి ఆదరణ దక్కుతోంది. ఇది గోవా, పూనేల్లోని కొండల్లో నిర్వహిస్తున్నారు. మొదట్లో గోవా బీచ్‌లో మాత్రమే జరుగగా దీనికి విపరీతమైన ఆదరణ లభించడంతో సన్‌బర్న్ హిల్స్ ఫెస్ట్‌గా మార్చారు. ఈ ఏడాది పూనెలో డిసెంబర్ 27 నుంచి 4 రోజులపాటు సాగనుంది. ఇంటర్నేషనల్ బ్యాండ్స్ లైవ్ పర్‌ఫార్మెన్స్‌తో ఆహుతులను ఉర్రూతలూగించే వేదికగా మనవారికి ఇది చేరువైంది.

మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్
imageమ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇండియా ఫెస్టివల్ రాజస్థాన్‌లో డిసెంబర్ 14 నుంచి మూడు రోజులు జరుగనుంది. కంటెంపరరీ మ్యూజిక్, ఆర్ట్స్‌కు పెద్ద పీట వేస్తూ చిందులేసేలా చేస్తారు. 
 

స్టార్మ్ మ్యూజిక్ ఫెస్ట్
పేరులో ఉన్నట్టే ఇది ఓ మ్యూజిక్ స్టార్మ్. మ్యూజిక్ సునామీ అంటే ప్రాణంపెట్టేవారు దీన్ని ప్రిఫర్ చేస్తారు. ఇండీ, ఫోక్, ఎలెక్ట్రానిక్, నాన్-మెయిన్‌స్ట్రీమ్ ఇలా క్లాసిక్ మ్యూజిక్ ప్రియులకు పసందైన వేదికగా ఉన్న స్టార్మ్ ఏడాది చివర్లో బెంగళూరులో జరుగుతుంది.


 

English Title
Music Vacation
Related News