మృదుస్వర మంజరి ఆ మురళి

Updated By ManamFri, 08/10/2018 - 02:54
chandra babu naidu

chandrababuస్వరాన్ని సంగీతంలో తడిపి, శ్రావ్వమైన పద్ధతిలో చేసేదే గానం. ఆ గానానికి ప్రాణం పోసి శాస్త్రీయ సంగీతాన్ని నలుదిక్కులా వ్యాప్తి చేయాలనే  తన గురువుల స్ఫూర్తితో  ముందుకు సాగుతున్న స్వర ఝరి. స్వరాలను, సరాలను తన గానంలో మేళవించి ప్రదర్శించే తీరు అనితర సాధ్యం. ఓ స్థాయి గుర్తింపు వచ్చాకా సినీరంగం వైపు అడుగులు వేసే తోటి గాయకులకు ఆమె కాస్త భిన్నం. సినీ గానంలో సాహిత్యానికి ప్రాధాన్యత ఉంటేనే ఆలపిస్తాను అంటున్న స్వర మంజరి మృదురవళి. సంగీతానికి అవధులు లేవు. సరిహద్దులను చెరిపేసే సంగీతానికి అందరూ బంధువులే. త్యాగరాజ కీర్తనలు, అన్నమయ్య సంకీర్తనలు, లలిత గీతాలు అన్నీ ఆమె గొంతులో ఒదిగి మెరిసాయి. అటు చదువును, ఇటు సంగీతాన్ని రెండింటి కీ సమయాన్ని కేటాయిస్తూ దూసుకుపోతున్న స్వరఝరి మృదురవళితో మిసిమి ముచ్చట్లు... తను సాధించిన విజయశిఖరాలకు నాంది చిన్నతనంలోనే పడింది అంటుంది రవళి. గానం, వీణా వాయిద్యం ఇలా తను అనుకున్న రంగాలలో విజయాలకు అక్క  హరిణి కూడా సింగరే కావడం తనకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. హరిణితో కలిసి దర్భా సిస్టర్స్ గా చాలా సంగీత కచేరీలు చేసారు. ఎపీ డిపార్ట్ మెంట్ ఆఫ్ కల్చరల్ కి రవళి సింగర్‌గా ఎంపికయ్యారు. ప్రభుత్వం తరపున జరిగే ప్రతి కార్యక్రమం ముందుగా రవళి పాటతోనే ప్రారంభం 
అవుతుంది. 

సొంత ఊరు....
పుట్టింది, పెరిగిందీ అంతా విజయవాడే. అమ్మ శ్రావణి, నాన్న ఫణీంద్ర. ఇద్దరం అమ్మాయిలమే అయినా మా ఇష్టాలని గౌరవించారు. మా సంగీత కచేరీలకు, పాటల కాంపిటీషన్స్ కు నాన్నగారు అమ్మా దగ్గరుండి తీసుకెళ్ళేవారు. 

సంగీతానికి గురువులు.., 
మాకు సంగీతం వారసత్వంగా వచ్చిందనుకుంటాను. నాయనమ్మ దశిక పార్వతి. ఆమె మంగళంపల్లి బాలమురళీకృష్ణగారికి సమకాలికురాలు. వారికి గట్టి పోటీ ఇచ్చేదట. నా మూడవ యేటనే  బాల మురళీకృష్ణగారి ఒడిలో కూర్చుని పాడాను. అంపోలు మురళీకృష్ణగారి దగ్గర సంగీతాన్ని అభ్యసించాను. ఇప్పుడు చెన్నైలో శ్రీమతి సవితా నర  సింహంగారి దగ్గరకు వెళ్ళి నేర్చుకుంటున్నాను. వీరే నా గురువులు.

చదువు, కచేరేలు..
 టెన్త్ , ఇంటర్ లో స్టేట్ లెవల్ లో ర్యాంక్ సాధించాను. ఎమ్. బి. ఏ, చేసాను. సంగీతంలో ఎమ్. ఏ మ్యూజిక్,  చేసాను. అలాగే మ్యూజిక్ లో పి.ఎచ్.డి  ప్రయత్నాలలో ఉన్నాను. నా మొదటి కచేరీ నా తొమ్మిదవ యేటనే ఇచ్చాను. ఇప్పటికి చాలా కచేరీలు చేసాను. అన్నమాచార్య ఉత్సవాలకు చాలా ఏళ్ళుగా పాడుతున్నాను.

ఇప్పటి తరానికి మీరు చెప్పే మాట....
చదువు కావాలి గానీ చదువే అన్నీ కాకూడదు. నేటి యువతకు చదువే అన్నీ అయిపోతుంది. ఆటలు, పాటలకు వారికి సమయమే ఉండదు. తల్లితండ్రులు కూడా చదువుకు ఇస్తున్న ప్రాధాన్యత సంగీతానికి, ఆటలకూ ఇవ్వడంలేదు. చదువు కాకుండా మిగతా వ్యాపకాలు ఉండాలి. సంగీతం ఒత్తిడిని దూరం చేస్తుంది. దీనివలన చదువులో ఒత్తిడిని అధిగమించవచ్చు. తల్లితండ్రులు అటుగా తమ పిల్లలను ప్రోత్సహించాలి.

అవార్డులు.. రివార్డులు...
ఆలిండియా రేడియో, దూరదర్శన్ బిగ్రేడ్ ఆర్టిస్ట్ గా ఉన్నాను.  సెంట్రల్  గవర్నమెంట్  కాలర్షిప్ హోల్డర్ ని. అలాగే నేషనల్ యూత్ ఫెస్టివల్ లో అన్ని స్టేట్స్ మీద  ఏపీ తరపున మొదటి బహుమతి గెలిచాను. ఆలిండియా రేడియోవారు నేషనల్ లెవల్ లో నిర్వహించిన కాంపిటీషన్ లో డియోషనల్ కేటగిరిలో  మూడవ బహుమతి వచ్చింది. 

English Title
Muttuvarnara Manjari that Murali
Related News