నా మనసుకు దగ్గరైన సినిమా ఎం.ఎల్.ఎ

Updated By ManamThu, 03/22/2018 - 02:53
MLA-movie-Pre-Release

MLA-movie-Pre-Release-నందమూరి కల్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా టి.జి.విశ్వప్రసాద్ సమర్పణలో బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో కిరణ్‌రెడ్డి, భరత్ చౌదరి నిర్మించిన చిత్రం ‘ఎంఎల్‌ఎ’. ఈ సినిమా మార్చి 23న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. నందమూరి కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ ‘‘కథను నమ్మి సినిమాలు తీసే నిర్మాతలంటే నాకు ఎంతో ఇష్టం. అటువంటి వారిలో ఈ నిర్మాతలు ముందుంటారు. తప్పకుండా భవిష్యత్‌లో పెద్ద నిర్మాతలు అవుతారు. పటాస్ విన్నప్పుడు ఎంత ఎగ్జయిట్ అయ్యానో.. ఈ సినిమాకు కూడా అంతే ఎగ్జయిట్ అయ్యాను. సినిమాను కళ్లకు కట్టినట్లు నెరేషన్ ఇచ్చాడు ఉపేంద్ర. నా మనసుకు దగ్గరైన సినిమా ఇది. తప్పకుండా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది’’ అన్నారు. అల్లరి నరేశ్ మాట్లాడుతూ ‘‘కల్యాణ్‌కి ఎం.ఎల్.ఎ బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుంది. ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

 వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ‘‘మంచి సినిమాను మంచి హీరో, టీంతో కలిసి చేయడం అంత సులభం కాదు. పటాస్ తర్వాత అదే ఎనర్జీ కల్యాణ్‌రామ్‌లో కనపడుతుంది. ఈ సినిమా తనకు మంచి హిట్ అవుతుంది’’ అన్నారు. నిర్మాత కిరణ్‌రెడ్డి మాట్లాడుతూ  ‘‘బ్లూప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో మా రెండో సినిమా. నేనే రాజు నేనే మంత్రి సమయంలోనే ఉపేంద్రగారు నాకు ఈ కథను చెప్పారు. థ్రిల్లింగ్‌గా సినిమాను కళ్లకు కట్టినట్లు నెరేట్ చేశారు. కథ విన్న కల్యాణ్‌రామ్‌గారు సినిమా చేయడానికి అంగీకరించారు. ఆయనతో ఈ సినిమాకు పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. నిర్మాతల గురించి ఆలోచించే హీరో’’ అన్నారు. నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ మాట్లాడుతూ ‘‘కల్యాణ్‌రామ్‌గారితో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో తొలి సినిమా చేయడం హ్యాపీగా ఉంది. ఆయనతో మరిన్ని సినిమాలను చేయాలనుకుంటున్నాను’’ అన్నారు. దర్శకుడు ఉపేంద్ర మాధవ్ మాట్లాడుతూ  ‘‘కల్యాణ్‌గారు దర్శకుడిగా నాకు పూర్తి స్వేచ్ఛ నిచ్చారు. కథ విన్న ఆయన ‘మనం ఈ సినిమా చేస్తున్నాం’ అని అన్నారు. ఎక్కువ సమయం తీసుకోకుండా ఓకే చెప్పేశారు. సినిమాకి పనిచేసిన ప్రతి ఆర్టిస్టు, టెక్నీషియన్ ఎంతో సపోర్ట్ చేశారు. అందరికీ థాంక్స్’’ అన్నారు. 

English Title
My mind is closer to the film MLA
Related News