చిన్న సినిమాల నిర్మాణంలో..!

Updated By ManamWed, 09/19/2018 - 18:53
mythri movie makers
mythri movies

శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, రంగస్థలం చిత్రాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్న నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ఈ మూడు చిత్రాలు అగ్ర కథానాయుకులతో చేసిన భారీ బడ్జెట్ చిత్రాలే. అయితే కేవలం భారీ బడ్జెట్ చిత్రాలే కాదు.. తక్కువ బడ్జెట్ చిత్రాలను కూడా నిర్మించడానికి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సన్నాహాలు చేసుకుంటుంది. సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఎప్పుడో స్టార్ట్ అయ్యాయట. కొత్త దర్శకుడు, కొత్త నటీనటులతో ఈ సినిమా తెరకెక్కనుందనేది సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయట. 

English Title
mythri movie makers produtions doing low budget movies
Related News