'నా పేరు సూర్య‌'.. రొమాంటిక్ సాంగ్ టైమ్ ఫిక్స‌య్యింది

Updated By ManamTue, 02/13/2018 - 15:53
nps

npsఅల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న‌ చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. అను ఇమ్మాన్యుయేల్ క‌థానాయిక‌. వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ ఈ చిత్రానికి విశాల్ శేఖ‌ర్ సంగీత‌మందించారు. ఇదిలా ఉంటే.. ప్రేమికుల రోజు సంద‌ర్భంగా ఈ చిత్రంలోని 'ల‌వ‌ర్ ఆల్సో ఫైట‌ర్ ఆల్సో' అంటూ సాగే పాట‌ని రేపు (బుధ‌వారం) విడుద‌ల చేయ‌నున్నారు. తాజాగా, ఏ స‌మ‌యంలో ఆ పాట‌ని విడుద‌ల చేయ‌బోతున్నారో చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. బుధ‌వారం ఉద‌యం 8.30 గంట‌ల‌కు ఈ సాంగ్‌ను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అంతేగాకుండా, సినిమా విడుద‌ల తేదిని ఏప్రిల్ 27 నుంచి ఏప్రిల్ 26కి మార్చిన‌ట్లుగా చిత్ర వ‌ర్గాలు పేర్కొన్నాయి.

English Title
'naa peru surya'.. romatic single time fixed
Related News