నాగార్జున, ధనుశ్ మల్టీస్టారర్ ప్రారంభం

Updated By ManamFri, 09/07/2018 - 09:50
Dhanush, Nagarjuna

Dhanush, Nagarjunaఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లో మల్టీస్టారర్ల హవా నడుస్తోంది. దీంతో మల్టీస్టారర్ చిత్రాలు తీసేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తిని చూపుతున్నారు. అయితే ఈ మల్టీస్టారర్‌లలో వివిధ భాషలకు చెందిన వారు నటిస్తుండటంతో ఇప్పుడు అవి బహు భాషా చిత్రాలుగా మారుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో బహుభాషా మల్టీస్టారర్ చిత్రం ప్రారంభమైంది.

నాగార్జున, ధనుశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న మల్టీస్టారర్ చిత్రం గురువారం పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ చిత్రానికి ధనుశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘పా. పాండి’తో దర్శకుడిగా మారిన ధనుశ్.. రెండో సినిమాగా మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించనుండటం విశేషం. ఇక ఈ చిత్రంలో శరత్ కుమార్, ఎస్ సూర్య, అదితీ రావు హైదారీ తదితరులు నటిస్తుండగా.. శ్రీ తెనాండల్ ఫిల్మ్స్ నిర్మిస్తుంది. త్వరలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

 

English Title
Nagarjuna, Dhanush multistarrer started
Related News