తమ్ముడు చూడాలనుందన్నారు.. ఇంతలోనే వదిలి వెళ్లారు

Updated By ManamWed, 08/29/2018 - 10:14
Harikrishna

Harikrishnaసినీ నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆయనతో తమ అనుబంధాన్ని చెప్పుకుంటూ పలువురు సినీ ప్రముఖులు హరికృష్ణకు తమ సంతాపాన్ని ప్రకటించారు. 

‘‘ ‘చాలా రోజులు అయ్యింది తమ్ముడు నిన్ను చూసి, కలవాలి తమ్ముడు’ కొన్ని రోజుల క్రితం నాతో ఈ మాటలు మాట్లాడిన ఆయన ఇప్పుడు దూరంగా వెళ్లిపోయారు. చాలా బాధగా ఉంది. నిన్ను మిస్ అవుతున్నా అన్నయ్య‘‘ అంటూ అక్కినేని నాగార్జున ట్వీట్ చేశారు. హరికృష్ణ హఠాన్మరణం చాలా బాధించిందని, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కుటుంబానికి తమ సంతాపం అంటూ పలువురు ప్రముఖులు తెలిపారు. వారిలో మోహన్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేశ్ బాబు, మంచు మనోజ్, నాని, కాజల్ అగర్వాల్, రామ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, సాయి బెల్లంకొండ, జెనీలియా, రకుల్ ప్రీత్ సింగ్, లక్ష్మీ మంచు,  దేవీ శ్రీ ప్రసాద్, శ్రీనువైట్ల, పూజా హెగ్డే, గౌతమి, శరత్ కుమార్, దర్శకుడు మారుతి, అనసూయ, గోపిచంద్ మలినేని తదితరులు ఉన్నారు.

 

English Title
Nagarjuna emotional words about Harikrishna
Related News