గన్‌తో నాగ్.. స్టెతస్కోప్‌తో నాని

Updated By ManamTue, 08/07/2018 - 17:23
Nagarjuna, Nani Devadas first look

Nagarjuna, Nani ‘Devadas’ first look

అక్కినేని నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో వస్తున్న ‘దేవదాస్’. ఈ మూవీపై రోజురోజుకు అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ మల్టీస్టారర్ చిత్రంపై అంచనాలు సైతం పెరిగిపోతున్నాయి. కాగా ఇక్కటికే ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌తో ఉన్న చిన్నపాటి పోస్టర్‌ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ తాజాగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ స్టిల్‌ను చూసిన అక్కినేని, నాని అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇప్పుడీ పోస్టర్ నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఈ పోస్టర్‌లో నాగ్, నాని ఇద్దరూ ఒకే పడుకుని నిద్రిస్తున్నారు. నాగార్జున ఓ చేతిలో వైన్ బాటిల్‌.. మరో చేత్తో గన్ పట్టుకుని ఉన్నాడు. ఇక నాని విషయానికొస్తే సరికొత్త లుక్‌లో స్టెతస్కోపు‌, పుస్తకాలతో దర్శనమిచ్చాడు. కాగా నాగ్ డాన్‌గా.. నాని డాక్టర్‌గా ఈ చిత్రంలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ ఫస్ట్‌లుక్‌ను నాగ్, నాని తన ట్విట్టర్ ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్ టైన‌ర్‌లో నాగార్జున‌కు జోడీగా ఆకాంక్ష సింగ్.. నానికి జోడీగా ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివ‌రిద‌శ‌లో ఉంది. సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. వైజ‌యంతి మూవీస్ సంస్థ‌పై అశ్వినీదత్ నిర్మాత‌గా.. సిధ‌ర్మ‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో దేవ‌దాసు వ‌స్తుంది. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్‌ లోగోకు మంచి రెస్సాన్స్‌ వచ్చింది.

న‌టీన‌టులు
నాగార్జున‌, నాని, ర‌ష్మిక మంద‌న్న‌, ఆకాంక్ష సింగ్, న‌రేష్ వికే, బాహుబ‌లి ప్రభాక‌ర్, రావు ర‌మేష్, వెన్నెల కిషోర్, అవ‌స‌రాల శ్రీ‌నివాస్, స‌త్య‌
బ్యాన‌ర్: వైజ‌యంతి మూవీస్
నిర్మాత‌: అశ్వినీద‌త్
ద‌ర్శ‌కుడు: శ్రీ‌రామ్ ఆదిత్య‌
సినిమాటోగ్ర‌ఫ‌ర్: శ్యామ్ ద‌త్ సైనూదీన్
సంగీత ద‌ర్శ‌కుడు: మ‌ణిశ‌ర్మ‌

English Title
Nagarjuna, Nani ‘Devadas’ first look
Related News