హిట్ టైటిల్‌తో నాగ్‌

Updated By ManamTue, 08/14/2018 - 11:22
Nagarjuna

Nagarjuna16 ఏళ్ల క్రితం నాగార్జున, సోనాలి బ్రిందే, అన్షు హీరో హీరోయిన్లుగా న‌టించిన `మ‌న్మ‌థుడు` చిత్రం పెద్ద స‌క్సెస్ అయ్యింది. ఈచిత్రానికి త్రివిక్ర‌మ్ మాట‌లు, స్క్రీన్‌ప్లే అందించారు. నాగార్జున‌కు మంచి విజ‌యంతో పాటు.. పేరుని తెచ్చి పెట్టిన చిత్ర‌మిది. ఇప్పుడు నాగార్జున మ‌న్మ‌థుడు 2 అనే టైటిల్‌ను రిజిష్ట‌ర్ చేయించార‌ట‌. మ‌రి ఈ టైటిల్‌ను రిజిష్ట‌ర్ చేయించడానికి కార‌ణ‌మేంటో తెలియ‌డం లేదు. మ‌న్మ‌థుడుకి సీక్వెల్ రూపొందనుందా? ఒక‌వేళ రూపొందితే అందులో నాగార్జునే న‌టిస్తాడా?  లేక ఆయ‌న త‌న‌యులు చైత‌న్య‌, అఖిల్‌ న‌టిస్తారా?  అని తెలియ‌డం లేదు. అయితే మొత్తానికి `మ‌న్మ‌థుడు 2` రావ‌డం ప‌క్కా అయింది. 

English Title
Nagarjuna registered Manmadudu 2 title
Related News