చేతి గోర్లు అందంగా,ఆరోగ్యంగా ఉండటానికి... 

Updated By ManamTue, 09/04/2018 - 14:42
nails

nailsసాధారణంగా అమ్మాయిలు చేతి గోర్లను చాల జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ ఇంట్లో పనుల వలన గోర్లు విరిగిపోవడం, పొడిబారిపోవడం సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. అలా జరగకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ చూసి తెలుసుకోండి.

ఆలివ్ ఆయిల్... 
ఆలివ్ ఆయిల్ ఎంత సహజసిద్ధమైందో తెలిసిందే. అలాంటి ఆలివ్ ఆయిల్‌ను గోర్లకు వాడడం వలన సరైన పోషణ అంది.. అవి బలంగా, అందంగా ఉంచేందుకు సహాయపడుతుంది.

పోషకాహారాన్ని తీసుకోవాలి..
గోర్లు ఆరోగ్యంగా పెరగడానికి తీసుకోవాల్సిన ఆహారం గుడ్లు, క్యాలీఫ్లవర్, అవకాడ్. ఇవి ఎక్కువగా తీసుకోవడం వలన గోర్లకు సరైన పోషణ అంది అందంగా కనిపిస్తాయి.

గోర్లకు ఎక్కువ ఒత్తిడి ఇవ్వకూడదు..

నీటిలో గోర్లు ఎక్కువసేపు ఉండడం వలన వాటి దృఢత్వవాన్ని కోల్పోయి విరిగిపోతాయి. అందుకే చేతికి గ్లౌజులు వాడి వాటిని సంరక్షించుకోవాలి. అలాగే వాటిని నీటిలో ఎక్కువ సమయం ఉంచకుండా చూసుకోవాలి అప్పుడే అవి ఆరోగ్యాంగా ఉంటాయి..

English Title
nails care for peeling and dying
Related News