హరికృష్ణ అంతిమ యాత్ర.. 

Updated By ManamThu, 08/30/2018 - 15:58
Nandamuri Hari Krishna, Hari Krishna funerals, TDP workers, CM Chandrababu naidu, NTR, Kalyanram

Nandamuri Hari Krishna, Hari Krishna funerals, TDP workers, CM Chandrababu naidu, NTR, Kalyanramహైదరాబాద్: దివంగత నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర ప్రారంభమైంది. గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో నివాసం నుంచి హరికృష్ణ పార్థివ దేహాన్ని బయటకు తీసుకువచ్చారు. అధికారిక లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు మొదలయ్యాయి. మెహదీపట్నం నుంచి జూబ్లీహీల్స్ మహాప్రస్థానం వరకు హరిక్రిష్ణ అంతిమ యాత్ర కొనసాగనుంది.

సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంతిమ సంస్కారాలు జరుగనున్నాయి. హరికృష్ణ కడచూపు కోసం అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. 'హరికృష్ణ అమర్ రహే' అంటూ అభిమానులు నినాదాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. హరికృష్ణ పార్థీవదేహాన్ని ఇంట్లో నుంచి ప్రచార రథం ఎక్కించారు. దాదాపు పది కిలోమీటర్ల మేర హరికృష్ణ అంతిమయాత్ర కొనసాగనుంది. 

English Title
Nandamuri Hari Krishna funerals starts from his house
Related News