రేపు నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు

Updated By ManamWed, 08/29/2018 - 12:55
nandamuri harikrishna
  • మోహదీపట్నంలోని నివాసానికి హరికృష్ణ భౌతికకాయం

  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

Nandamuri Harikrishna death: Telangana government orders state funeral

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు గురువారం నిర్వహించనున్నారు. మొయినాబాద్‌ మండలం ముర్తజగూడలో ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు జరపనున్నారు. గతంలో  పెద్ద కుమారుడు జానకిరాం అంత్యక్రియలు జరిగిన చోటే హరికృష్ణకు కుటుంబసభ్యులు అంత్యక్రియలు చేయనున్నారు.

కాగా హరికృష్ణ మృతదేహానికి కామినేని ఆస్పత్రిలో ప్రభుత్వ వైద్యులు పోస్టుమార్టం పూర్తిచేశారు. అనంతరం అంబులెన్స్‌లో హరికృష్ణ పార్ధీవదేహాన్ని రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. మోహదీపట్నంలోని నివాసానికి భౌతికకాయాన్ని తీసుకు వెళుతున్నారు. అంబులెన్స్‌లో హరికృష్ణ పార్థీవదేహం పక్కన ఆయన సోదరుడు రామకృష్ణ, ముందు వాహనంలో తనయులు కళ్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్‌తోపాటు దర్శకుడు త్రివిక్రమ్ ఉండగా మరో వాహనంలో ఏపీ సీఎం చంద్రబాబు,  బాలకృష్ణ, లోకేశ్ తదితరులు వస్తున్నారు.

ప్రభుత్వ అధికార లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు
మరోవైపు హరికృష్ణ అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరగనున్నాయి. ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారవం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు.

English Title
Nandamuri Harikrishna death: Telangana government orders state funeral
Related News