నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు పూర్తి

Updated By ManamThu, 08/30/2018 - 16:13
Nandamuri Hari Krishna funeral
  • తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు

  • తండ్రి చితికి నిప్పంటించిన కుమారుడు కల్యాణ్ రామ్

  • అశ్రు నయనాలతో తుడి వీడ్కోలు...

Harikrishna funeral హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో గురువారం పూర్తయ్యాయి. కుటుంబసభ్యులు, అభిమానులు, సన్నిహితుల కన్నీటి వీడ్కోలు మధ్య  హైదరాబాద్ జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు ముగిశాయి. కుమారుడు కల్యాణ్ రామ్ తండ్రి చితికి నిప్పంటించారు.  అంతకు ముందు పోలీసులు గౌరవ సూచికంగా తుపాకీలతో మూడు రౌండ్లు గాలిలోకి పేల్చారు.

నందమూరి కుటుంబసభ్యులు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బాలకృష్ణ, లోకేష్,  టీడీపీ నేతలు, టాలీవుడ్ ప్రముఖులు, ఎన్టీఆర్ అభిమానులు హరికృష్ణకు కడసారి నివాళులు అర్పించి, తుది వీడ్కోలు పలికారు. మరోవైపు మోహదీపట్నం నుంచి జూబ్లీహిల్స్ వరకూ సాగిన అంతిమయాత్రలో హరికృష్ణ అమర్ రహే నినాదాలతో మార్మోగింది.

English Title
Nandamuri Harikrishna funeral with state honours, thousands say bye
Related News