మహాప్రస్థానంలో హరికృష్ణ అంత్యక్రియలు

Updated By ManamWed, 08/29/2018 - 16:33
nandamuri harikrishna-kcr
  • కుటుంబసభ్యులు కోరినచోట అంత్యక్రియలు: తలసాని

Nandamuri Harikrishna death-kcr

హైదరాబాద్ : నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు ఆయన కుటుంబసభ్యుల అభీష్టం మేరకే జరుగుతాయని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కాగా హరికృష్ణ అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి.  నందమూరి హరికృష్ణ అంత్యక్రియల సందర్భంగా  ఆయన సందర్శనార్థం వచ్చే అభిమానులకు  ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని  ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. 

గురువారం సాయంత్రం నాలుగు గంటల నుంచి హరికృష్ణ అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే అంతకు ముందు హరికృష్ణ అంత్యక్రియలు ... మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో నిర్వహిస్తారనే వార్తలు వెలువడ్డాయి. చివరికి మహాప్రస్థానంలోనే అంత్యక్రియలు చేయనున్నట్లు తెలుస్తోంది. 

English Title
Nandamuri harikrishna Funeral in Vaikunta Mahaprasthanam at Jubilee Hills
Related News