సీతయ్య రెడీ!

Updated By ManamSun, 09/02/2018 - 12:31
Nandamuri balakrishna
nandamuri Harikrishna

ఏలూరు : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, సినీ నటుడు నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా ఆయన విగ్రహం తయారైంది. రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ ఆకస్మిక మరణంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా తన పుట్టినరోజుకు ఎలాంటి హంగూ, ఆర్భాటాలు చేయవద్దని, ఆ డబ్బును కేరళ వరద బాధితులకు పంపాలంటూ హరికృష్ణ బతికుండగానే ...అభిమానులకు లేఖ రాశారు కూడా.

కాగా పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట మండలం పెనుగొండ శివారు గరువులో అచ్చం హరికృష్ణను మరిపించేలా విగ్రహాన్ని సిద్ధం చేశారు. ఈ విగ్రహాన్ని హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు అందచేయనున్నారు.  హరికృష్ణలో ఉట్టిపడే రాజసం విగ్రహంలో కనబడేలా తయారు చేసినట్లు వారు తెలిపారు.

మరోవైపు హరికృష్ణ జయంతి సందర్భంగా ఆయనను ఏపీ సీఎం చంద్రబాబు స్మరించుకున్నారు. చైతన్య రథసారథి, తన ఆత్మీయుడైన హరికృష్ణ ఇక లేరన్న నిజాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నట్లు ఆయన ట్విట్ చేశారు. 

English Title
Nandamuri Harikrishna statue ready in west godavari district
Related News