బీజేపీకి నందీశ్వర్ గౌడ్ గుడ్‌బై..

Updated By ManamSat, 09/08/2018 - 17:04
 Nandheeswar Goud Revokes Decision
  • పటానుచెరు టికెట్ ఖరారు..

Nandheeswar Goud Revokes Decision

హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో నేతల వలసలు జోరందుకుంటున్నాయి.  ఆపరేషన్ ఆకర్ష్‌‌లో భాగంగా టికెట్ ఆశావాహులు ఓ పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ చేస్తున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్... బీజేపీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన తిరిగి సొంతగూటికి చేరనున్నారు. 

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, జానారెడ్డితో నందీశ్వర్ గౌడ్ ఇవాళ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నందీశ్వర్ గౌడ్‌కు పటాన్‌చెరు టికెట్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నందీశ్వర్ గౌడ్ రేపు లేదా ఎల్లుండి (ఆది, సోమవారం) కాంగ్రెస్‌లో చేరనున్నారు. కాగా డీ శ్రీనివాస్‌కు నందీశ్వర్ గౌడ్ అత్యంత సన్నిహితుడు. డీఎస్ మళ్లీ సొంతగూటికే చేరతారనే నేపథ్యంలో నందీశ్వర్ గౌడ్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు.

English Title
Nandeshwar Goud good bye to BJP, his likely to join congress
Related News