నన్ను దోచుకుందువటే సక్సెస్ మీట్

Updated By ManamSun, 09/23/2018 - 01:46
success meet

సుధీర్‌బాబు, నభా నటేశ్ జంటగా సుధీర్‌బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆర్.ఎస్.నాయుడు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. ఈ నెల 21న సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన సక్సెస్‌మీట్‌లో దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు మాట్లాడుతూ ‘‘కామెడీ, ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. కామెడీ సీన్ విషయానికి వస్తే.. షార్ట్ ఫిలిం సీన్ బాగా నచ్చుతుంది. అలాగే ఎమోషనల్ సీన్ విషయానికి వస్తే తండ్రి కొడుకుల సీన్ అందరికీ కనెక్ట్ అవుతుంది. నిర్మాతగా సుధీర్‌గారు కథను నమ్మి చేసిన సినిమా ఇది. నభా ఎనర్జిటిక్‌గా నటించింది. ఈ సక్సెస్‌లో భాగమైన సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్’’ అన్నారు.

image


నభా నటేశ్ మాట్లాడుతూ ‘‘నేను బాగా నటించానని అందరూ అంటుండంతో ఆనందంగా ఉంది. సక్సెస్‌లో నన్ను పార్ట్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ ‘‘క్లీన్ యు మూవీ... ఫ్యామిలీ అంతా కలిసి చూసే మూవీని నా తొలి చిత్రంగా ప్రొడ్యూస్ చేసినందుకు గర్వంగా ఉంది. సినిమా చూసిన హరీష్, రానా, ఇంద్రగంటి, సందీప్, గోపీమోహన్ అందరూ సోషల్ మీడియాలో తమ సపోర్ట్‌ను అందించారు. విమర్శకులు కూడా సినిమా బావుందని అప్రిషియేట్ చేయడం ఆనందంగా ఉంది. అష్టాచమ్మాలో స్వాతి,  బొమ్మరిల్లులో హాసిని రోల్స్‌తో నభా క్యారెక్టర్‌ను కంపేర్ చేశారు. అంత కామెడీ నా సినిమాలో వర్కవుట్ అవుతుందా? అని ఆలోచించేవాడిని. ఈ సినిమాలో షార్ట్ ఫిలిమ్ సీన్ అంతలా నవ్వించింది. సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు హ్యాపీగా అనిపించింది’’ అన్నారు. 

English Title
nannu dochukunduvate movie success meet
Related News