కొడుకో.. కూతురో పుట్టినట్లు అనిపిస్తుంది - సుధీర్‌బాబు

Updated By ManamWed, 09/19/2018 - 20:01
Nannu Dochukunduvate
nannu dochukundhuvate

సుధీర్‌బాబు ప్రొడక్షన్స్ పతాకంపై సుధీర్‌బాబు, నభా నటేశ్ జంటగా నటించిన చిత్రం ‘నన్నుదోచుకుందువటే’. ఆర్.ఎస్.నాయుడు దర్శకుడు. ఈ నెల 21న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో హరీశ్ శంకర్ మాట్లాడుతూ ‘‘సాఫ్ట్‌వేర్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేసి నన్నుదోచుకుందువటే అనే టైటిల్ పెట్టాడంటే.  డైరెక్టర్ స్పాన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ‘సమ్మోహనం’ సినిమాలో సుధీర్ పెర్‌పార్మెన్స్‌కు ఫ్యాన్ అయ్యాను. అజనీష్ ట్యూన్ సెన్స్ బావుంది. సురేశ్ ఫోటోగ్రఫీ కాంటెంపరరీగా ఉంది. నభా నటేశ్ చాలా ఎక్స్‌ప్రెసివ్ హీరోయిన్.

    సుధీర్ ప్యాషన్‌తోనే సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇదే ప్యాషన్ తనను ఇంకా ముందుకు తీసుకెళుతుంది’’ అన్నారు. ఆర్.ఎస్.నాయుడు మాట్లాడుతూ ‘‘నేను చేసిన పదిహేను నిమిషాల షార్ట్‌ఫిలిం చూసి నచ్చడంతో సుధీర్‌బాబుగారు సినిమా ప్రొడ్యూస్ చేశారు. నభా నటేశ్ ఎనర్జిటిక్ గర్ల్. మంచి పెర్ఫామర్. అందరూ చక్కగా సపోర్ట్ చేశారు’’ అన్నారు. సుధీర్ బాబు మాట్లాడుతూ ‘‘మా ప్రొడక్షన్‌లో తొలి సినిమా. ఆర్.నాయుడుగారు కథ చెప్పినప్పుడు హీరో సుధీర్‌తో పాటు ప్రొడ్యూసర్ సుధీర్‌కి కూడా కథ బాగా నచ్చేసింది. నభా నటేశ్ చాలా మంచి నటి. హీరోగా చేస్తూ నిర్మాతగా చేయడం అంటే డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్. బాగాఎంజాయ్ చేశాను. నాకొక కొడుకో, కూతురో పుట్టినట్టుగా ఉంది’’ అన్నారు. 
 

English Title
Nannu Dochukunduvate release date fixed
Related News