అమిత్‌షాకు నారా లోకేశ్‌ కౌంటర్‌

Updated By ManamFri, 04/06/2018 - 21:06
Nara lokesh babu counter to Amith shah

Nara lokesh babu counter to Amith shah అమరావతి: విపక్షాలను జంతువులతో పోలుస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా చేసిన వ్యంగ్య వ్యాఖ్యలపై ఏపీ మంత్రి నారా లోకేశ్ దీటుగా కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం ఆయన ట్విట్టర్ వేదికగా అమిత్ షా వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఐదుకోట్ల మంది ప్రయోజనాల కోసం, హక్కులకై పోరాడుతుంటే కుక్కలతో పోలుస్తారా? అంటూ లోకేశ్ మండిపడ్డారు. ‘మా హక్కులు కోసం ఉద్యమిస్తుంటే పిల్లులు.. పాములు.. ముంగిసలని’ అంటారా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ను బీజేపీ నాలుగేళ్లపాటు అంధకారంలో పెట్టిందని.. తలపొగరుతో జంతువులతో పోలస్తోందన్నారు. బీజేపీ వినాశకాలం దాపురించిందని విమర్శించారు. అందుకే ఇలా విపరీత బుద్ది ప్రదర్శిస్తోందని లోకేశ్ ట్విట్టర్‌లో మండిపడ్డారు. చివరిగా బైకాట్ బీజేపీ అనే హ్యాష్ ట్యాగ్‌లైన్‌ను కూడా ట్వీట్‌కు జత చేశారు. 

కాగా, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ప్రతిపక్షాలను కుక్కలు, పిల్లులు, పాములు జంతువులతో పోలుస్తూ వాడివేడి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మోదీ ప్రభంజనం నుంచి తమను తాము రక్షించుకోవడానికి అవన్నీ ఒక్కటవుతున్నాయని షా వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

English Title
Nara lokesh babu counter to Amith shah
Related News