నారా రోహిత్ మరో సాహసం

Updated By ManamWed, 03/14/2018 - 11:24
nara rohith

nara rohith వైవిధ్య కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతున్న నారా రోహిత్ మరో సాహసం చేయబోతున్నాడు. తన తదుపరి సినిమాలో మూగవాడి పాత్రలో కనిపించబోతున్నాడు ఈ హీరో. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. 'లేడీస్ అండ్ జంటిల్‌మెన్' దర్శకుడు పీబీ మంజునాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతుండగా.. శ్రీ వైష్ణవి క్రియేషన్స్ పతాకంపై నారాయణ రావు అట్లూరి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. తెలుగు సంవత్సరాది ఉగాది రోజున ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే వెంకటేశ్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కబోయే 'ఆట నాదే వేట నాదే' చిత్రంలో కూడా నారా రోహిత్ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే.

English Title
Nara Rohith playing dump role in next movie
Related News